టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, ఎంపీ కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. అదికూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో. పైగా జరిగింది లండన్ లో. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జాగృతి యునైటెడ్ కింగ్ డమ్ శాఖ ఆధ్వర్యంలో లండన్ లో నిర్వహించగా వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరవడం విశేషం.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తెలంగాణ జాగృతి కార్యక్రమాలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి - మేయర్ సలేర్ జాఫర్ - లండన్ లోని భారత హైకమిషనర్ ఫస్ట్ సెక్రటరీ వీజాయ్ వసంత - బ్రిటన్ ఎంపీ స్టీఫెన్ టిమ్స్ - మిల్టన్ కీన్స్ - తదితరులు హాజరయ్యారు.
ఇటీవలి కాలంలో టీఆర్ ఎస్-బీజేపీల మధ్య బంధం ముడిపడితుందున్న వ్యాఖ్యల నేపథ్యంలో వెంకయ్య ప్రత్యేకంగా లండన్‌కు వెళ్లి మరీ జాగృతి వేడుకలకు హాజరవడం ఆసక్తికరంగా మారింది. సహజంగా సంఘాలు నిర్వహించే వేడుకలకు దూరంగా ఉండే వెంకయ్య ఆ తీరును పక్కనపెట్టి జాగృతి వేడుకలకు వెళ్లడం విశేషం. పైగా ఈ కార్యక్రమానికి ఎంపీ కవిత హాజరుకాకపోయినప్పటికీ ఆమె సారథ్యంలోని తెలంగాణ జాగృతి సారథ్యంలో జరుగుతున్న కార్యక్రమాలకు వెంకయ్యనాయుడు వెళ్లడం కొత్త చర్చకు దారితీస్తోంది.