దమ్ముంటే జగన్ ను ఎదుర్కో.. నువ్వు కేసీఆర్ కోవ‌ర్టుః జేసీ పై వీహెచ్ ఫైర్

Update: 2021-03-18 06:30 GMT
ఏపీ టీడీపీ నాయ‌కుడు జేసీ దివాక‌ర్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత‌రావు విరుచుకు ప‌డ్డారు. నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓడిపోతుంద‌ని, ఇక‌, టీ-కాంగ్రెస్ నేత‌లు దుకాణం మూసేసుకొని ప్ర‌త్యామ్నాయం చూసుకోవాల‌న్న‌ జేసీ వ్యాఖ్య‌ల‌‌పై వీహెచ్‌ తీవ్రంగా స్పందించారు.

జేసీ దివాక‌ర్ రెడ్డి కేసీఆర్ కు కోవ‌ర్టుగా ప‌నిచేస్తున్నార‌ని అనుమానం వ్య‌క్తంచేశారు. తెలంగాణ కాంగ్రెస్ గురించి, రాయ‌ల‌సీమ టీడీపీ నాయ‌కుడికి ఏం ప‌ని అని ప్ర‌శ్నించారు. ఇదంతా గూడుపుఠానీ వ్య‌వ‌హారంగా అనుమానించిన వీహెచ్‌.. సాగ‌ర్ ఎప ఎన్నిక‌లో కేసీఆర్ కు ల‌బ్ధిచేకూర్చాల‌నే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని అన్నారు.

జేసీ రాజ‌కీయాలు ఏపీ చేసుకోవాల‌ని, తెలంగాణ‌లో రాజ‌కీయ జాత‌కాలు చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ‘‘నీకు ద‌మ్ముంటే జ‌గ‌న్ ను ఎదుర్కో. రాయ‌ల‌సీమ‌లో, ఏపీలోని ఇత‌ర ప్రాంతాల్లో జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా పోరాడ‌డంలో నీ స‌త్తాచూపించు’’ అని సవాల్ చేశారు వీహెచ్.

సోనియా, రాహుల్ గాంధీపైనా జేసీ అనుచిత‌ వ్యాఖ్య‌లు చేయ‌డంపై వీహెచ్ మండిప‌డ్డారు. వాళ్ల‌ను అవ‌మానించే వ్యాఖ్య‌లు చేస్తే.. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు చూస్తూ ఊరుకోర‌ని అన్నారు. అదే స‌మ‌యంలో టీకాంగ్రెస్ నేతలు భ‌ట్టి, జీవ‌న్ రెడ్డి, రాజ‌గోపాల్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు వీహెచ్‌. దివాక‌ర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నా.. వీళ్లు మౌనంగా ఉన్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తూ కంప్లైట్ చేశారీ సీనియ‌ర్ లీడ‌ర్‌.

కాగా.. ఈ విష‌య‌మై అధిష్టానం ఆరాతీసింది. దీనిపై సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క వివ‌ర‌ణ ఇచ్చారు. జేసీ వ్యాఖ్య‌ల‌ను వెంట‌నే అడ్డుకున్నామ‌ని భ‌ట్టి చెప్పారు. ‘‘ద‌శాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నో ఉన్న‌త ప‌ద‌వులు అనుభ‌వించిన మీరు.. పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు స్వార్థ రాజ‌కీయాల‌కోసం టీడీపీలో చేరారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను గుర్తించిన సోనియా రాష్ట్రం ఇచ్చార‌ని, దాన్ని ఎలా త‌ప్పుబ‌డ‌తారు?’’ అంటూ ఖండించామని భట్టి వెల్లడించారు.

అంతేకాకుండా.. ‘‘రాజకీయ అవకాశవాదులైన మీలాంటి వాళ్లు వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే కాకుండా.. మీ లాంటి వారికి ఆశ్రయమిచ్చిన పార్టీలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని వ్యాఖ్యానించినట్టు చెప్పారు భట్టి. కాగా.. సీల్పీ కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో.. సోనియా అనవసరంగా తెలంగాణ ఇచ్చారంటూ జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


Tags:    

Similar News