బీజేపీ ఎంపీకి సరిబేసి షాక్

Update: 2016-04-18 09:39 GMT
దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెర తీసిన సరి-బేసి విధానం మరోసారి ఢిల్లీలో అమలవుతున్న సంగతి తెలిసిందే. సరి సంఖ్యతో ఉన్న వాహనాలు ఒకరోజున.. బేసి సంఖ్యతో ఉన్న వాహనాలు మరో రోజున చొప్పున ఢిల్లీ రోడ్ల మీదకు అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానంపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా బీజీపీ ఎంపీ విజయ్ గోయల్ సరి-బేసి విధానాన్ని ఉల్లంఘిస్తూ తన వాహనాన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చారు.

దీంతో.. ఢిల్లీ పోలీసులు స్పందించి ఆయన వాహనాన్ని నిలిపివేశారు. పోలీసుల తీరుతో ఇగో హర్ట్ అయిన సదరు ఎంపీ ఫైన్ కట్టేందుకు నో అంటే నో అన్న పరిస్థితి. ఈ సమాచారం అందుకున్న ఢిల్లీ రాష్ట్ర మంత్రి గోపాల్ రాయ్.. తానే స్వయంగా రంగంలోకి దిగారు. ఎంపీ విజయ్ గోయల్ వద్దకు వచ్చిన మంత్రి ఆయన చేతికి గులాబీ పువ్వు ఇవ్వటం.. ఫైన్ కట్టాలని చెప్పటంతో సదరు ఎంపీ గారు మాట్లాడలేక డబ్బులు చెల్లించాల్సి వచ్చింది.

తన దగ్గర ఫైన్ వసూలు చేస్తారా? అన్న ఆవేదన ఎంపీ గోయల్ మాటల్లో స్పష్టంగా వినిపించింది. సరి-బేసి పేరు చెప్పి ఢిల్లీ ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారని.. ఈ విధానం మీద తాము పోరాటం చేస్తామంటూ ఎంపీ మండిపడుతున్నారు. ఎంపీ అయి ఉండి ఫైన్ కడితే ఇగో హర్ట్ అవుతుంది కదా?
Tags:    

Similar News