భారతీయ బ‌్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్ చెక్కేసి జల్సాగా గడుపుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విషయంలో కేంద్రం నుంచి అనూహ్యమైన ప్రకటన వెలువడింది. ప్రస్తుతం లండన్ లో ఉంటున్న విజయ్ మాల్యాను భారత్ కు తీసుకురావడం అంత సులువైన విషయం కాదని కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. మాల్యా అప్పగింత అంత సింపుల్ విషయం కాదని అన్నారు.
బ్యాంకులకు అప్పులు ఎగవేయడం, ఇతరత్రా ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇచ్చిన డాక్యుమెంట్లను బ్రిటన్ కు పంపించామని తెలిపిన కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి, వాళ్ల చట్టం పరిమితులు ఇచ్చిన వెంటనే మాల్యాను తీసుకువస్తామని స్పష్టం చేశారు. మాల్యాను ఎప్పుడు తీసుకువస్తామన్న అంశాన్ని ఇప్పుడే తేల్చలేమని వీకే సింగ్ తెలిపారు. బ్రిటన్ ఎప్పుడు పర్మిషన్ ఇస్తే, అప్పుడే మాల్యాను భారత్ కు తీసుకువస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. తద్వారా మాల్యా రాకపై అనుమానపు మేఘాలు కమ్ముకునేలా చేశారు.
ఇదిలాఉండగా ఇటీవలే విజయ్ మాల్యాకు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆడే అన్ని మ్యాచ్‌లు చూస్తానని ఇప్పటికే చెప్పిన మాల్యా.. సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా ఓవల్ గ్రౌండ్ కు వచ్చాడు. ఈ సందర్భంగా అక్కడున్న భారత అభిమానులు అతన్ని చూడగానే హేళన చేశారు. దొంగా.. దొంగా.. అంటూ అరిచారు. దీంతో మాల్యాకు మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ ను చూసినపుడే మాల్యాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అతను మరింత రెచ్చిపోయి.. ఇండియా ఆడే అన్ని మ్యాచ్ లూ చూస్తానని అప్పుడే చెప్పాడు. అంతేకాదు కోహ్లి ఫౌండేషన్ నిర్వహించిన చారిటీ డిన్నర్ కు కూడా మాల్యా వచ్చాడు. అక్కడ కూడా ఇండియన్ టీమ్ అతనికి మొహం చాటేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/