వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తరచుగా టీడీపీ పైనా.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడిపైనా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఏదో ఒక సబ్జెక్టుపై వారిని విమర్శలతో కామెంట్లు చేసేవారు. అయితే, తాజాగా జవహర్ లాల్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే చిన్న పిల్లల దినోత్సవాన్ని కూడా ఆయన రాజకీయాలకు వాడుకున్నారు.
చిన్న పిల్లల దినోత్సవాన్ని పురస్కరించుకుని.. టీడీపీ యువ నాయకుడు , మాజీ మంత్రి నారా లోకేష్ పై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ``అమూల్ బేబీ అలియాస్ పప్పునాయుడుకు చిన్నారుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.
హ్యాపీ చిల్డ్రన్స్ డే`` అని సాయిరెడ్డి ట్వీట్ చేశారు. వాస్తావానికి ఒక పెద్ద పార్టీ, అందునా 151 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ నేతగా, ఒక రాష్ట్రానికి అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నాయకుడిగా సాయిరెడ్డి ఇలా వ్యాఖ్యానించడం .. చీప్‌గా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు.
వాస్తవానికి ట్విట్టర్ ద్వారా విమర్శలు చేసుకోవడం.. సహజమే అయినా, మరీ ఇంతగా దిగజారి పోయి వ్యాఖ్యలు చేయాలా? అనేది నెటిజన్ల ప్రశ్న. భాషా ప్రయోగంలోనూ.. మరింత దారుణంగా హద్దులు చెరిపేయడం ఎందుకనే ప్రశ్న కూడా తెరమీదికి వచ్చింది. ఇప్పటికి చాలాసార్లు ఇలానే సాయిరెడ్డి చీప్‌గా వ్యవహరించి.. విమర్శల పాలయ్యారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింతగా ఆయనను డ్యామేజీ చేయడం గమనార్హం.
Full View Full View Full View Full View

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.