అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తను ప్రస్తుతం ఉంటున్న భవంతిని తన అధికారిక నివాసంగా గుర్తించాలని ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరారు. ‘ప్రజా వేదిక’ భారాన్ని ప్రభుత్వమే మోయాలని - తన అధికారిక నివాసంగా గుర్తించి అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు నాయుడు కోరుతూ ఉన్నారు.
అయితే ఈ విషయంలో ప్రభుత్వంలోని నేతల నుంచి ఏ మాత్రం సానుకూలత వ్యక్తం కావడం లేదు. అసెంబ్లీలోనూ - బయట వాళ్లు ఒకే మాట చెబుతూ ఉన్నారు. ఈ విషయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇప్పటికే స్పందించారు. చంద్రబాబు నాయుడను ఆ నివాసం నుంచి ఖాళీ చేయిస్తామని ఆయన ప్రకటించేశారు కూడా!
ఇక తాజాగా విజయసాయి రెడ్డి కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. అది అక్రమ కట్టడమే అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కృష్ణా నదిని కొద్ది మేర పూడ్చి అక్కడ చాలా మంది భవంతులు కట్టిన వైనాన్ని విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు ఉంటున్నది కూడా అలాంటి అక్రమ కట్టడంలోనే అని ఆయన పేర్కొన్నారు.
దాన్ని చంద్రబాబు నాయుడు ఖాళీ చేయాల్సిందే అని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడుకు ప్రకృతి సంపదపై మోజు ఎక్కువ అని - అలాంటి సంపదను చూడగానే చంద్రబాబు నాయుడు దాన్ని తన సొంతం అనుకుంటారని.. అదే తీరును కృష్ణా నదిని పూడ్చి కట్టిన భవంతిలో ఆయన ఉంటున్నారని.. ఆయన తక్షణం ఆ భవంతిని ఖాళీ చేయాలని విజయసాయి రెడ్డి సూచించారు.
మొత్తానికి అధికార పార్టీలోని నేతలు ఇలా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ భవంతిని చంద్రబాబు నాయుడు ఖాళీ చేయడం మాటేమిటో కానీ - ఆయన కోరినట్టుగా అధికారిక నివాసంగా మాత్రం గుర్తించే అవకాశాలు లేవని స్పష్టం అవుతోందని పరిశీలకులు అంటున్నారు.