టీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరాక పాపం విజయశాంతికి రాజకీయంగా ఒడిదుడుకులు తప్పడం లేదు. గడిచిన 2014 ఎన్నికల్లో ఓడిపోయాక రాజకీయాలకు దూరమైంది. చాలారోజులుగా అస్సలు బయట కనిపించలేదు. ఈ మద్యే హైదరాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా మారుతున్నానని హింట్ ఇచ్చింది. అయినా కాంగ్రెస్ పెద్దలు ఆమెను పట్టించుకోలేదు. దీంతో మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లింది. తాజాగా తెలంగాణ ముందస్తు ఎన్నికల వేళ.. రాములమ్మ మౌనం వీడారు.
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సన్నద్ధత - వ్యూహాలపై తన అభిప్రాయాలను కాంగ్రెస్ అధిష్టానానికి విజయశాంతి చెప్పినట్టు తాజా సమాచారం. సీనియర్ లీడర్లు - సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీని ఏర్పాటు చేయాలని విజయశాంతి కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారట.. దామోదర రాజనర్సింహా - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - మధుయాష్కీ - డీకే అరుణతో పాటు తన పేరును జోడించి కమిటీ వేస్తే ప్రభావముంటుందని విజయశాంతి అభిప్రాయపడ్డారట.. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటూ సీనియర్లతో ప్రచార కమిటీని నియమిస్తేనే కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆమె స్పష్టం చేశారట.. ఈ మేరకు ఏఐసీసీని కోరినట్టు తెలిసింది.
కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఉత్తమ్ నాయకత్వంలో కాంగ్రెస్ సీనియర్లపై పూర్తి భారం మోపింది. వారే ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తున్నారు. రాహుల్ - సోనియా సభలకు ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఈ ఎన్నికల వేడిలో విజయశాంతిని.. ఆమె ప్రతిపాదనను పట్టించుకునే అవకాశాల్లేవు. 4 ఏళ్లుగా సైలెంట్ గా ఉండి ఎన్నికల వేళ అందరితో కలిసి పనిచేసి కాంగ్రెస్ కు ఊపు ఇస్తే బాగుంటుందని.. ఇలా మధ్యలో వచ్చి తనకు పగ్గాలు కావాలంటే ఎలా అని మిగతా కాంగ్రెస్ నేతలు విజయశాంతి పై విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం మరి విజయశాంతి ప్రతిపాదనను పట్టించుకుంటుందా.? రాములమ్మా యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.