సాయిరెడ్డి డేర్‌!... అది సంసార‌మా? వ‌్య‌భిచార‌మా?

Update: 2018-12-31 09:03 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ అసెంబ్లీకి జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ ఏపీలో ఎన్నిక‌ల వేడి అంత‌కంత‌కూ రాజుకుంటోంది. అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ, కొత్త పార్టీ జ‌న‌సేన‌, మొన్న‌టి ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని సాగిన బీజేపీ, ఈసారైనా త‌మ‌కు క‌నీస సంఖ్య‌లో సీట్లైనా ద‌క్క‌క‌పోతాయా? అంటూ ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీలు... త‌మ త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. ఇన్ని పార్టీలు రంగంలో ఉన్నా ప్ర‌ధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ మ‌ధ్యేన‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఈ కార‌ణంగానే ఈ రెండు పార్టీల‌కు చెందిన నేత‌ల మ‌ధ్య విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు హ‌ద్ద‌లు దాటి పోతున్నాయి. అస‌లు రాజ‌కీయ నేత‌ల నుంచి గ‌తంలో మ‌నం విన‌న‌టువంటి వ్యాఖ్య‌లు, హాట్ కామెంట్స్ ఇప్పుడు నిత్య‌కృత్య‌మైపోయాయ‌నే చెప్ప‌క త‌ప్ప‌దు.

ప్ర‌తి విష‌యంలోనూ త‌న‌కు అనుకూలంగా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వ్యూహాన్ని మార్చుకోవ‌డంలో దిట్ట‌గా మారిన టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడును ఏకంగా యూట‌ర్న్ అంకుల్ అంటూ త‌న‌దైన శైలిలో స‌రికొత్త విమ‌ర్శ‌ల‌కు తెర తీసిన వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి.. చంద్ర‌బాబుపై వ‌రుస‌గా ఏమాత్రం విరామం లేకుండా విమ‌ర్శ‌ల దాడి చేస్తున్నారు. త‌న‌పై టీడీపీ నేత‌లు చేస్తున్న ఎదురు దాడిని స‌మ‌ర్ధంగా తిప్పికొడుతూనే... చంద్ర‌బాబుపై త‌న సెటైరిక్ విమర్శ‌ల బాణాల‌ను సంధించ‌డం మాత్రం ఆయ‌న ఆప‌డం లేదు. తాజాగా నేడు కూడా చంద్ర‌బాబుపై సాయిరెడ్డి త‌న‌దైన శైలి కామెంట్ల‌తో విరుచుకుప‌డ్డారు. నాలుగేళ్ల పాటు బీజేపీతో అంట‌కాగిన టీడీపీ... ఆ మైత్రికి ఏం పేరు పెడ‌తార‌ని ప్ర‌శ్నించ‌డమే కాకుండా... అస‌లు ఆ నాలుగేళ్ల బంధం సంసార‌మో.? వ‌్య‌భిచార‌మో?  చెప్పాలంటూ సాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీలో నాలుగేళ్ల పాటు అంట‌కాగి... ఇప్పుడు అదే బీజేపీని విమ‌ర్శిస్తున్న చంద్ర‌బాబు వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టిన సాయిరెడ్డి... చంద్ర‌బాబును ఏకంగా *మీరు వ్య‌భిచారా?* అంటూ పెను సంచ‌ల‌న‌మే రేపారు.

హైకోర్టు విభ‌జ‌న‌కు సంబంధించి చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టిన సాయిరెడ్డి... పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో నేటి ఉద‌యం మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా ఈ వ్యాఖ్య‌లు చేశారు. బాబుపై సాయిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల విష‌యానికి వ‌స్తే... *ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి విలువలు లేవని చెప్పడానికి నిన్న చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. గత నాలుగేళ్లుగా బీజేపీతో టీడీపీ చేసింది సంసారమా? లేక వ్యభిచారమా? అన్నది చంద్రబాబు చెప్పాలి. మీరు ఓ వ్యభిచారా? డిసెంబర్ 31లోపు ఏపీలో హైకోర్టు భవనం నిర్మాణం పూర్తవుతుందని చంద్రబాబు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. సాధారణంగా రాష్ట్రానికి హైకోర్టు వస్తుందంటే ఎవరైనా సంతోషిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం ఇప్పుడు తెగ బాధపడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం లేఖ రాస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నాం. హైకోర్టు అఫిడవిట్ విషయంలో చంద్రబాబుపై కోర్టు ధిక్కార నేరం కింద కేసు పెట్టి జైలు శిక్ష విధించాలి. ఏపీలో చంద్రబాబు రూ.4 లక్షల కోట్లు దోచుకున్నారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే ఈ మొత్తాన్ని కక్కిస్తాం.* అని సాయిరెడ్డి త‌న‌దైన శైలిలో ఫైరైపోయారు. ఈ వ్యాఖ్య‌ల‌కు టీడీపీ నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి.




Full View
Tags:    

Similar News