జగన్ ప్రభుత్వంలో తొలి పదవి ఈయనకే..

Update: 2019-06-02 14:13 GMT
అధికారం మారితే అంతా మరుతుంది.. కొత్త సీఎం.. కొత్త మంత్రులు.. కొత్త నామినేటెడ్ పోస్టులు... ఇలా అన్నింటిలోనూ కొత్త ప్రభుత్వాలకు చెందిన వారు వస్తుంటారు. అలా ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ జోరందుకుంది. ఇప్పటికే టీటీడీ చైర్మన్ పదవిని వైవీ సుబ్బారెడ్డికి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది..

తాజాగా మరో సంఘాన్ని వైసీపీ టేకోవర్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. మొత్తం 8 కమిటీలు - పలు అనుబంధ కమిటీలను ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఎంపీ విజయసాయిరెడ్డి నియమితులు కావడం విశేషం. ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ధర్మానా కృష్ణదాస్ ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. క్రీడాకారుడిగా యవ్వనంలో ఉన్నప్పుడు కృష్ణదాస్ పేరొందాడు. అందుకే ఆయనకు ఈ క్రీడల సంఘానికి అధ్యక్షుడిగా నియమించడం విశేషం.

ఇలా జగన్ ప్రభుత్వం వచ్చాక జరిగిన తొలి సంఘం నియామకంలో తొలి పదవి జగన్ సన్నిహితుడికే లభించడం విశేషంగా మారింది. మున్ముందు ఇలాంటి నామినేటెడ్ పదవులన్నింటిని వైసీపీ నేతలతోనే భర్తీ చేసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలకు పదవుల పండుగ వరించనుంది.

ఇక ఒలింపిక్ సంఘం నియామకం కాగానే గుంటూరులో ఏపీ ఒలింపిక్ భవన్ నిర్మాణం చేపడుతామని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. నిజాయితీగా పనిచేసే జగన్ ప్రభుత్వం వచ్చిందని.. క్రీడల అభివృద్ధికి పనిచేయాల్సి ఉందన్నారు.


Tags:    

Similar News