గత కొన్ని రోజులుగా డేటా స్కామ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓటర్ల వ్యక్తిగత డేటాను దొంగిలించారనే ఆరోపణలు పోలీసు కేసుల దాకా వెళ్లింది. ఇందులో కీలకంగా ఉన్న హైదరాబాద్ లోని ఐటీ గ్రిడ్ సంస్థను తాత్కాలికంగా మూసివేశారు. ఈ వ్యవహారంలో టీడీపీ హస్తం ఉందని వైసీపీ నాయకులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన కీలక నేత విజయ సాయిరెడ్డి సైకిల్ పార్టీపై సెటైర్లు వేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అయితే ఆయన కుమారుడు చిట్టి నాయుడు(లోకేశ్) అని విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో వ్యాఖ్యానించి సెటైర్ వేశారు. మంగళవారం ఆయన ట్విట్టర్ లో ఓ పోస్టులో ఎండగట్టారు. 'లోకేశ్ చిప్ కు సిగ్నల్ అందడం లేదు.. ఎర్రర్ చూపిస్తోంది.. వారం రోజులుగా లోకేశ్ ను చంద్రబాబు అజ్ఞాతంలో ఉంచారు.. డేటా స్కామ్ కు ఆద్యుడైన అశోక్... లోకేశ్ చిప్ ను యాక్టివేట్ చేయడంలో విఫలయత్నం చెందాడు' అంటూ ట్విట్టర్ లో బాబు-లోకేష్ లకు దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా ఏపీలో రాజకీయ వాతావరణ వేడెక్కింది. రాజకీయ పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం తీవ్రమైంది. అయితే ఎన్నికల వేళ.. వైసీపీకి మాత్రం డేటా స్కాం వ్యవహారం ఒక అస్త్రంలా దొరికినట్లయింది. దీంతో వైసీపీ నాయకులు ఈ విషయాన్ని ప్రధానంగా చేసుకొని చంద్రబాబు చేస్తున్న అవినీతికి ఇదే నిదర్శనమంటూ ఎత్తి చూపిస్తున్నారు.
ఇక ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వ చేసిన లోటుపాట్లను గుర్తిస్తున్న వైసీపీ నాయకులు వాటిని ఎన్నికల ప్రచారంలో వాడుకోనున్నారు. ఆయా నియోజకవర్గాలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు - ఎంపీలు చేసిన వాగ్దానాలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. వారు చేస్తానన్న పనులు.. చేయ్యని పనులను గుర్తించి వాటిని ఎత్తి చూపుతున్నారు. వీటిలో భాగంగానే విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ లో కియా మోటార్స్ గురించి ప్రస్తావించి సంచలన ఆరోపణలు చేశారు.
చైనాకు చెందిన కియా మోటార్స్ నష్టాల్లో ఉండడంతో కొన్నిప్లాంట్లను మూసివేసిందని - అయితే అనంతపురంలో మాత్రం ఆ కంపెనీ నుంచి కమీషన్లు తీసుకొని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లపై టీడీపీ నాయకులు ఏ విధంగా సమాధానం చెబుతారోనని పార్టీ నాయకుల్లో ఆసక్తికరంగా మారింది