కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారు..మాస్క్ ధరించని కేసీఆర్ కి ఫైన్ వేయాల్సింది !

Update: 2021-04-20 10:30 GMT
తెలంగాణ‌లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోన్న‌ క్రమంలో  ఈ రోజు నుండి రాత్రి పూట క‌ర్ఫ్యూ విధిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి స్పందిస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణలో కరోనా కట్టడికి సంబంధించి సర్కారుపై సోమవారం హైకోర్టు సంధించిన ప్రశ్నల్ని చూస్తే రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించినట్లు స్పష్టం అవుతుంది అని , కరోనా టెస్టుల నిర్వహణ, కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై గతేడాది కూడా సర్కారు ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. అప్పుడు కూడా హైకోర్టు పలుమార్లు మందలించింది. అయినా తెలంగాణ సర్కారు తీరు మారలేదని అన్నారు. స్కూళ్లు ఏమో మూసేశారు. పబ్‌లు, క్లబ్‌లు, గుంపులు గుంపులుగా తిరుగుతున్న జనాన్ని కట్టడి చేయడం మాత్రం చేయలేకపోతున్నారు అంటూ విమర్శించారు.

బెడ్స్ కొరత గురించి న్యాయమూర్తులడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలారు. సరైన సమాచారం లేని ప్రభుత్వ నివేదికల్లోని లోపాలపై హైకోర్టు నిలదీసింది.సరిగ్గా కిందటేడాది ఏం తప్పులు జరిగాయో... అవే ఇప్పుడూ పునరావృతం అవుతున్నందువల్లే రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ అంటూ ఆరోపించారు. కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్ గారు అంతకుముందు మాస్క్ లేకుండా సమీక్షలు నిర్వహించి, సభల్లో పాల్గొన్న ఫొటోలు మీడియాలోను, సోషల్ మీడియాలోను చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఆయన్ని పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు వారి అధినేత బాటలోనే నడుస్తూ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారారు. ఆ ఫైన్ ఏదో మాస్కు ధరించని కేసీఆర్ గారికి, ఆ పార్టీ నేతలకు కూడా వేసి ఉంటే పాపం ఆయన జాగ్రత్త పడేవారు. ఇక కరోనా కేసులు పెరుగుతుంటే .. కేవలం రాత్రివేళ కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారు కానీ, పగటి పూట ఎలాంటి నియంత్రణలూ లేకుండా ఈ ప్రభుత్వం సాధించదలుచుకుంది ఏమిటో అర్థం కావడం లేదు. ఈ నేతలు, ఈ సర్కారును నమ్ముకుంటే ఇంతే సంగతులని జనానికి బాగా అర్థమయ్యేలా చేస్తున్నారు అని అన్నారు.
Tags:    

Similar News