విజయకాంత్ భార్య బీజేపీలోకి..?

Update: 2016-03-15 10:24 GMT
  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధపడిన విజయ కాంత్ నిర్ణయాన్ని ఆ పార్టీ సీనియర్లు వ్యతిరేకిస్తున్నారట. పార్టీ నేతలే కాదు విజయకాంత్ భార్య ప్రేమలత కూడా బీజేపీతో కలిసినడుద్దామంటూ భర్తపై ఒత్తిడి చేస్తున్నారని.... ఆమె బీజేపీలో చేరేందుకు కూడా ఆసక్తిగా ఉన్నారని సమాచారం.
   
తమిళనాడులో విజయకాంత్ పార్టీకి అటు ఇటుగా 8 శాతం ఓట్లు దక్కుతాయని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనతో పొత్తు కోసం డిఎంకె - బిజెపి పార్టీలు ఆసక్తి చూపాయి. కానీ విజయకాంత్ అందరికీ షాకిస్తూ... ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే, ఒంటరి పోరుతో లాభం లేదని, సొంత పార్టీలోని సీనియర్లే పెదవి విరుస్తున్నారు. మరోవైపు విజయకాంత్ ఒంటరి పోరు అని చెప్పినప్పటికీ బిజెపి ఇప్పటికీ తనవంతు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఆయన తమ దారికి రాకపోతే.. ఆయన దారిలో నడిచేందుకు కూడా బిజెపి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2011 ఎన్నికల్లో అన్నాడిఎంకె విజయంలోనూ విజయకాంత్ పార్టీ ప్రభావం ఉందని కూడా గతంలో కొన్ని సర్వేలు కూడా తేల్చిచెప్పాయి. విజయకాంత్‌ తో కూటమికి సంబంధించి ఇప్పటికే ప్రకాశ్‌ జవదేకర్‌ అతనితో కలసి ఓమారు చర్చలు జరిపారు. విజయకాంత్‌ ప్రకటన చేసిన తర్వాత కూడా వారు విజయకాంత్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఆయన్ను ఎలాగైనా నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రకాశ్‌ జవదేకర్‌ మరోసారి విజయకాంత్‌ తో చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. మరోవైపు విజయకాంత్ భార్య ప్రేమలత కూడా బిజెపిలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరెన్ని చెప్పినా ఒంటరిగా ఎక్కువ సీట్లు గెలుచుకొని కింగ్ మేకర్ కావాలని విజయకాంత్ అనుకుంటున్నారని సమాచారం.
Tags:    

Similar News