`వైఎస్ మంత్రుల‌`కు విజ‌య‌మ్మ ఆహ్వానం.. వ్యూహమిదేనా?

Update: 2021-08-30 10:42 GMT
రాజ‌కీయాల్లో ఏం జ‌రిగినా.. నేత‌లు ఎలాంటి అడుగులు వేసినా..దానివెనుక‌.. వ్యూహం లేకుండా ఉండ‌దు. అడుగు తీసి అడుగు వేస్తే.. రాజ‌కీయ నేత‌లు స్వ‌ప్ర‌యోజ‌నాలే కోరుకుంటారు. ఈ విష‌యంలో ఏ పార్టీని ప‌క్కన పెట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఏ పార్టీ అయినా.. స్వ‌ప్ర‌యోజ‌న‌మే గీటురాయిగా ప్ర‌తిపాద‌నలు చేస్తుం ది. ఇప్పుడు ఇలాంటిదే తెలంగాణ‌లోనూ జ‌రుగుతోంది!   దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌తీమ‌ని.. వైఎస్ విజ‌య‌మ్మ‌.. తాజాగా వైఎస్ సీఎంగా వ్య‌వ‌హ‌రించిన‌ కాలంలో ఆయ‌న మంత్రివ‌ర్గంలో ప‌నిచేసిన వారికి ``రండి.. ఆతిథ్యం స్వీక‌రించండి`` అంటూ.. ఆహ్వానాలు పంపారు. ఈ ప‌రిణామం ఇప్పుడు అనేక కోణాల్లో చ‌ర్చ‌కు దారితీసింది.

పైకి చెబుతోంది ఏంటంటే!

వ‌చ్చే నెల 9న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. 12వ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం ఉంది. ఆ రోజున త‌మ ఇంట్లో జ‌రిగే కార్య‌క్ర మానికి రావాలంటూ.. వైఎస్ హ‌యాంలో మంత్రులుగా చేసిన వారికి, ఆయ‌న చేతి చ‌లువ‌గా.. రాజ‌కీయ చ క్రం తిప్పిన‌వారికి .. మేధావులుగా చ‌లామ‌ణి అయిన‌వారికి విజ‌య‌మ్మ ఆహ్వానాలు పంపారు. వీరిలో ప్ర‌స్తుతం టీఆర్ ఎస్‌లో మంత్రులుగా ఉన్న స‌బితా ఇంద్రారెడ్డి నుంచి మాజీ స్పీక‌ర్‌.. కేఆర్ సురేష్ రెడ్డి.. ఏపీకి చెందిన మేధావి ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌, వైఎస్ ఆత్మ‌గా పేర్కొనే.. కేవీపీ రామ‌చంద్రరావు, మాజీ పీసీసీ అధ్య‌క్షుడు.. ధ‌ర్మ‌పురి శ్రీనివాస్‌.. ఇలా చాలా మంది ఉన్నారు. వీరంతా .. ఒక‌ప్పుడు ఉమ్మ‌డి రాష్ట్రంలో రాజ‌కీయ చ‌క్రం తిప్పిన‌వారే. ఇప్పుడు వీరిని త‌న ఇంటికి ఆహ్వానించి.. వైఎస్‌కు ఘ‌న నివాళులు అర్పించాల‌ని.. విజ‌య‌మ్మ సంక‌ల్పించిన‌ట్టు ప్ర‌చారం చేస్తున్నారు. ఇది పైకి చెబుతున్న మాట‌.

పుష్క‌ర కాలం త‌ర్వాత‌!

ఎంతైనా వైఎస్ స‌తీమ‌ణి క‌నుక‌.. ఏపీ అధికార పార్టీ వైసీపీకి గౌర‌వ అధ్య‌క్షురాలు కూడా అయిన‌ విజ‌య‌మ్మ కూడా రాజ‌కీయంగానే అడుగులు వేస్తార‌నే వాద‌న ఉంది. లేక‌పోతే వైఎస్ మ‌ర‌ణించి.. 12 సంవ‌త్స‌రాలు.. అంటే పుష్క‌ర కాలం త‌ర్వాత‌.. ఈ సీనియ‌ర్ల‌ను, గ‌తంలో వైఎస్ హ‌యాంలో ప‌నిచేసిన మంత్రుల‌ను ఎందుకు.. ఆహ్వానిస్తారు?  ఇప్ప‌టి వ‌ర‌కు లేని ప్రేమ, ఆప్యాయ‌త ఇప్పుడే ఎందుకు పొంగుకు వ‌చ్చింది?  పైగా.. ఎప్పుడు అవ‌కాశం వ‌చ్చినా.. త‌మ‌ను త‌మ కుటుంబాన్ని కొంద‌రు నాయ‌కులు అన్యాయం చేశార‌ని.. కేంద్రానికి ఫిర్యాదులు కూడా చేశార‌ని.. ఆరోపించిన విజ‌య‌మ్మ‌.. హ‌ఠాత్తుగా ఆ కొంద‌రినే ఎందుకు ఆహ్వానించిన‌ట్టు? ఇదీ ఇప్పుడు కీల‌క చ‌ర్చ‌నీయాంశం.!

తెర‌చాటు వ్యూహం ఇదేనా?

ఊర‌క‌రారు.. అన్న‌ట్టుగానే.. విజ‌య‌మ్మ కూడా ఆయా  నేత‌ల‌ను.. ఊరికేనే ఆహ్వానించ‌డం లేద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. చాలా పెద్ద వ్యూహంతోనే విజ‌య‌మ్మ నాటి నేత‌ల‌ను, మేధావుల‌ను వైఎస్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మానికి ఆహ్వానిస్తున్నార‌ని.. చెబుతున్నారు. ప్ర‌స్తుతం వైఎస్ దంప‌తులు ముద్దుల త‌న‌య‌.. ష‌ర్మిల తెలంగాణ‌లో పార్టీ పెట్టుకున్నారు. దీనికి ఇప్ప‌టి వ‌ర‌కు ఊపు రాలేదు. ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. కొన్ని మీడియాలైతే.. ఎప్పుడో ప‌క్క‌న పెట్టాయి. ఇక‌, కీల‌క‌మైన నాయ‌కులు ఎవ‌రూ కూడా ష‌ర్మిల వెంట న‌డిచేందుకు ముందుకు రావ‌డం లేదు. ఈ త‌రుణంలో నాటి వైఎస్ మంత్రివ‌ర్గంలో చేసిన వారిని, ఆయ‌న త‌ర‌ఫున గ‌ట్టివాయిస్ వినిపించిన వారిని ఒకేతాటిపైకి తెచ్చి.. త‌న కుమార్తెకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని.. అదే వైఎస్ కు ఇచ్చే ఘ‌న నివాళి అని.. విజ‌య‌మ్మ చెప్పే ప్ర‌య‌త్నం చ‌చేస్తున్నారా? అని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News