పీఠం పవర్ : వెంకయ్య ప్లేస్ లో విజయసాయిరెడ్డి

Update: 2022-08-04 09:06 GMT
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి విజయసాయిరెడ్డి అరుదైన గౌరవం పొందారు. ఆయన పెద్దల సభకు అధ్యక్షత వహించారు. నిజంగా ఇది వైసీపీ శ్రేణులకు ఆనందం కలిగించే విషయం. రాజ్యసభ ప్యానల్ వైఎస్ చైర్మన్ హోదాలో ఆయన అధ్యక్ష పీఠాన్ని అలంకరించారు.

ఇక రాజ్యసభకు 2016లో ఎన్నిక అయిన విజయసాయిరెడ్డి తొలి ఆరు ఏళ్ళ  పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని రెండవ టెర్మ్ కి కూడా తాజాగా ఎంపిక అయ్యారు.

ఈ నేపధ్యంలో రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు ప్యానల్ చైర్మన్ల జాబితాను రూపొందించారు. అందులో విజయసాయిరెడ్డికి చోటు కల్పించారు. ఆ అవకాశం ఇపుడు ఫస్ట్ టైమ్ ఆయనకు దక్కింది.

ఈ రోజు సభలో చైర్మన్ వెంకయ్యనాయుడు, డిప్యూటీ చైర్మన్ కూడా రాలేదు. దాంతో ఈ సమున్నతమైన సింహాసనాన్ని అధిష్టించే మహదవకాశం విజయసాయిరెడ్డికి దక్కింది.

ఆయన రాజ్యసభ చైర్మన్ సీట్లో కూర్చుని సభను నడిపించిన తీరు అందరినీ ఆసక్తికరంగా అనిపించింది. విజయసాయిరెడ్డి ఆంగ్లంతో పాటు హిందీలో కూడా మాట్లాడుతూ సభను సమర్ధంగా  నిర్వహించారు. అలాగే విపక్షాన్ని కంట్రోల్ చేస్తూ ప్రశ్నోత్తర కార్యక్రమం సజావుగా సాగనివ్వాలని చెప్పడం కూడా జరిగింది.

దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వైసీపీ నేతలు రిలీజ్ చేసి అందరితో కలసి ఆనందం పంచుకున్నారు. ఆల్ ది బెస్ట్ విజయసాయిరెడ్డి గారూ అంటూ చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. మొత్తానికి విజయసాయిరెడ్డి అసలైన పెద్ద మనిషి అయిపోయారు అని పార్టీ వారు అంటున్నారు.
Tags:    

Similar News