సంచలనం సృష్టించిన విజయవాడ యువతి హత్య కేసును‌ చేధించిన‌ పోలీసులు !

Update: 2020-10-20 11:50 GMT

కలకలం సృష్టించిన విజయవాడ బీటెక్ విద్యార్థిని  హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఈ కేసు ను పోలీసులు ఛేదించారు. ఆ యువతిని దారుణంగా కత్తితో పొడిచి , హత్య చేసింది నింధుతుడు నాగేంద్రనే అని తేల్చేశారు. అయితే , ఈ ఘటన జరిగిన తర్వాత , హాస్పిటల్ నిందుతుడు మాట్లాడుతూ ..  ఇద్దరం ప్రేమించుకున్నామని, మంగళగిరి చర్చిలో పెళ్లి కూడా చేసుకున్నామంటూ చెప్పాడు, అలాగే  ఇద్దరికి పెళ్లి అయినట్టు కూడా కొన్ని ఫోటోలని వైరల్ చేశాడు. అయితే నిందుతుడు చెప్పినవి అన్ని మాటలు అబద్దాలే అని , అలాగే  వైరల్ చేసిన ఫోటోలు మార్ఫింగ్ చేసినవని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ హత్య  జరిగిన రోజు నాగేంద్ర, మొదటి అంతస్తు గదిలో నిద్రిస్తున్న యువతి రూములో దొంగతనంగా వెళ్లి, గడియ పెట్టాడని దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత యువతి తల్లి వచ్చి ఎంత అరచినా గడియ తీయలేదని, నాగేంద్ర ముందుగా సిద్దం చేసుకున్న కత్తితో దివ్య తేజస్వినిని విచక్షణా రహితంగా పొడిచి తాను కూడా స్వల్పంగా గాయాలు చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. దీంతో విజయవాడ బిటెక్ యువతి  కేసు మిస్టరీ బయటపడింది. ఇప్పటికే ఈ కేసును దిశ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో నిందుతుడు చేసిన కొన్ని తప్పులే చివరికి పోలీసులకి క్లూ గా మారి , హంతకుడిని పట్టించాయి. యువతి మొబైల్ ఫోన్ లో దొరికిన ఆడియో సంభాషణ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు మొదలుపెట్టి , ఒక్కొక్క విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటూ , చివరికి మిస్టరీని ఛేదించారు. ఆరు నెలలుగా నాగేంద్ర పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడని ఆ యువతి మాట్లాడిన మాటలు హంతకుడిని పట్టించాయి.

ఆ యువతితో  మంగళగిరి చర్చిలో పెళ్లి చేసుకున్నానని నాగేంద్ర చెబుతున్న మాటలు అబద్దమని పోలీసులు తేల్చారు. అసలు వారి మధ్య ప్రేమ వ్యవహారం నడవలేదని, స్థానికంగా పెయింటర్ గా పనిచేస్తున్న నాగేంద్ర, ప్రేమ పేరుతో  యువతిని వేధించినట్టు తేలింది. దీంతో నాగేంద్ర మొబైల్ లో దొరికిన ఫోటోలను ఎనాలసిస్ చేసిన పోలీసులు ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసినవని సాంకేతిక ఆధారాలతో తేల్చారు. దీంతో హంతకుడు నాగేంద్రేనని బయటపడింది.  ఈ హత్య జరిగిన తర్వాత బాధిత కుటుంబసభ్యుల బాధలు మిన్నంటాయి. హంతకుడిని ఎన్ కౌంటర్ చేయాలని ఆమె తండ్రి జోసెఫ్ డిమాండ్ చేశారు. యువతిని పథకం ప్రకారం హత్య చేశాడని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో తమకి న్యాయం జరిగేలా చూడాలని కోరడానికి నేడు ఆ యువతి పేరెంట్స్ సీఎం జగన్ ను , సీఎం కక్యాంప్ ఆఫీస్ లో సమావేశం కాబోతున్నారు.
Tags:    

Similar News