విజయసాయిరెడ్డి ఫోన్ మిస్సింగ్... టీడీపీకి డౌట్లే డౌట్లు

Update: 2022-11-23 09:34 GMT
వైసీపీలో కీలకమైన నేత, ఎంపీ అయిన వి విజయసాయిరెడ్డి ఫోన్ మిస్ అయిందని న్యూస్ ఇపుడు సంచలనం రేపుతోంది. ఆయన రాజకీయ ప్రముఖుడు. ఫోన్ ఎపుడూ ఆయనతోనే ఉంటుంది. పైగా మామూలు ఫోన్ కాదు ఐ ఫోన్. మొత్తం కీలకమైన సమాచారం అంతా ఉండే అంతటి విలువైన ఫోన్ మిస్సింగ్ అంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.

నిజానికి ఈ ఫోన్ మిస్ అయింది ఎపుడు, విజయసాయిరెడ్డి తన ఫోన్ పోయింది అని ఎపుడు తెలుసుకున్నారు అన్న వివరాల మీద సరైన సమాచారం అయితే లేదు కానీ తాజాగా  రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్‌ పోయినట్లుగా  ఆయన పీఏ లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలా ఈ విషయం మీడియాలో వెలుగు చూసింది. ఇక చూస్తే  ఈ నెల 21న ఐఫోన్ పోయిందని ఆ  ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎంపీ గారి ఫోని మిస్సింగ్ కేసుని తాడేపల్లి పోలీసుకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సరే ఐ ఫోన్ కాబట్టి దాని ఆచూకీ కనుగొనడం  ట్రేస్ చేసి తెచ్చిపెట్టడం కొంత టాస్క్ అయినా పోలీసులు కచ్చితంగా   సక్సెస్ అవుతారు అనే అంటున్నారు. కానీ ఎంపీ గారి ఫోన్ మిస్ అవడమే ఇపుడు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇక దీని మీద రాజకీయ రచ్చ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎవరికి వారు ఎంపీ ఫోన్ మిస్సింగ్ మీద పులిహోర కలిపి కమ్మగా వడ్డించేస్తున్నారు. ఎంపీ ఫోనే ఎందుకు మిస్ అయింది, ఇన్నాళ్ళూ లేనిది ఇపుడే ఎందుకు అలా అయింది అని ఆరాలూ వివరాలూ కూపీ తీసేవారు కూడా ఉన్నారు. అదే టైం లో చూస్తే గత రెండు రోజులుగా సాయిరెడ్డి తాడేపల్లిలో ఉన్నారనే సమాచారం పబ్లిక్ డొమైన్‌లో లేదని అంటున్న వారూ ఉన్నారు.

మరి ఆయన తాడేపల్లిలో లేకపోతే కనుక  అదే నిజమైతే తాడేపల్లిలో ఎందుకు కేసు నమోదు చేశారనేది ప్రశ్నగా కూడా కొందరు లేవనెత్తుతున్నారు. ఇక అన్నింటికీ మించి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వారు అయితే దీని మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ప్రచారం అయితే సాగుతోంది. అదేంటి అంటే  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విజయసాయిరెడ్డికి నోటీసులు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఈ మిస్సింగ్ ఫిర్యాదును ఉపయోగించి ఆయన ఫోన్ తనిఖీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారట.

అలాగే,  విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు ఈ కుంభకోణంలో అరెస్టయిన నేపధ్యంలో ఏకంగా విజయసాయిరెడ్డికే ఈ వ్యవహారాన్ని చుట్టేస్తూ మీడియాలో కూడా కధనాలు వస్తున్నాయి. ఇపుడు ఐ ఫోన్ మిస్సింగ్ నేపధ్యంలో వాటికి మరింత మసాలా దట్టిస్తున్నారు.

అయితే లోగుట్తు పెరుమాళ్ళ కెరుక అని సామెత ఉండనే ఉంది. పోయింది ఐ ఫోన్. అది దొరికితే అపుడేమంటారు అని వైసీపీ నుంచి కౌంటర్లు వస్తున్నాయి. ఏది ఏమైనా ఎంపీ గారి ఐ ఫోన్ మిస్సింగ్ కూడా ఇపుడు పొలిటికల్ రచ్చకు కారణం కావడమే విశేషమూ విడ్డూరమూనూ.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News