క‌రోనా రూల్స్ ఉల్లంఘ‌న‌.. ఆర్నెల్ల‌ జైలు, రూ.5 ల‌క్ష‌ల జ‌రిమానాకు ఛాన్స్!

Update: 2021-05-16 02:30 GMT
ప్ర‌భుత్వం విధించిన కొవిడ్ రూల్స్ ఉల్లంఘించినందుకుగానూ ఓ వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారించిన న్యాయ‌స్థానం అత‌డిని దోషిగా తేల్చింది. ఇక‌, తీర్పు ప్ర‌క‌టించ‌డ‌మే మిగిలి ఉంది. చ‌ట్ట ప్ర‌కారం అత‌డు చేసిన నేరానికి ఆర్నెల్ల జైలు శిక్ష‌, రూ.5 ల‌క్ష‌ల జ‌రిమానా విధించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఇదంతా జ‌రిగింది సింగ పూర్‌లో. దోషి మాత్రం భార‌తీయుడు!

పార్తీబ‌న్ బాలా చంద్ర‌న్ అనే 26 ఏళ్ల ఇండియ‌న్ సింగ‌పూర్ లోని జురాంగ్ ప్రాంతంలో ఉండేవాడు. అతనిలో గ‌తేడాది ఏప్రిల్ లో 20న వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. ఆసుప‌త్రికి వెళ్తే.. ప‌రీక్ష‌కు శాంపిల్స్ తీసుకున్నార‌ట‌. రిజ‌ల్ట్ రావ‌డానికి టైం ప‌డుతుంద‌ని చెప్పిన వైద్యులు.. ఇక్క‌డే ఉండాల‌ని చెప్పార‌ట‌. కానీ అక్క‌డి నుంచి వెళ్లిపోయిన చంద్ర‌న్‌.. ఇండియా వ‌చ్చేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లాడ‌ట‌. ఆ త‌ర్వాత వ‌చ్చిన అతని రిపోర్టులో పాజిటివ్ అని తేలింద‌ట‌.

వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు అత‌డికోసం వేట మొద‌లుపెట్టారు. ఎట్ట‌కేల‌కు ఎయిర్ పోర్టులో ఉన్న‌ట్టు తేల్చారు. దీంతో.. అత‌డిని అంబులెన్స్ లో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. 14 రోజులు ఐసోలేష‌న్లో ఉంచిన త‌ర్వాత అత‌డు నివాసం ఉండే జురాంగ్ ప్రాంతానికి పంపించారు. మ‌రో 14 రోజుల వ‌ర‌కు బ‌య‌ట‌కు రావొద్ద‌ని హెచ్చరించారు.

కానీ.. ఇత‌ర కార్మికులు కొవిడ్ బారిన ప‌డ‌డం చూసి అక్క‌డి నుంచి త‌ప్పించుకునేందుకు చూశాడు. మ‌ళ్లీ ఎయిర్ పోర్టుకు వెళ్లాడు. కానీ.. టికెట్ దొర‌క‌లేదు. ఈ విష‌యం మ‌రోసారి తెలుసుకున్న పోలీసులు.. రెండోసారి వ‌దిలిపెట్ట‌లేదు. కేసు న‌మోదు చేసి కోర్టుకు త‌ర‌లించారు. విచారించిన న్యాయ‌స్థానం దోషిగా తేల్చింది. త్వ‌ర‌లో తీర్పు రానుంది.
Tags:    

Similar News