100.. ఈ నంబరు గురించి ఎవర్నడిగినా చెబుతారు. ఆపదలో ఉన్నప్పుడు ఈ నంబరుకు కాల్ చేస్తే పోలీసులు వెంటనే స్పందిస్తారని జనం నమ్ముతారు. కానీ... సాధారణ ప్రజల మాట సంగతి దేవుడెరుగు ఒక హైకోర్టు న్యాయమూర్తికే ఆ నంబరు నుంచి రెస్పాన్సు రాలేదట. 100 నంబరుకు ఫోన్ చేస్తే ఏమాత్ర సాయమందలేదట. ఢిల్లీలో ఓ న్యాయమూర్తికి ఎదురైన ఈ అనుభవం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిగ్గా మారింది.
అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి విపిన్ సంఘీ పది రోజుల కిందట ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్ 100కు ఫోన్ చేశారు. అవతలి నుంచి రెస్పాన్స్ రాలేదు. కాసేపటికి పోలీసు కమిషనర్ కు కూడా విషయం చెప్పాలని చూశారు. ఆయనా స్పందించలేదు. దీంతో ఈ విషయాన్ని కోర్టుకు ఓ లేఖ రూపంలో చెప్పగా, దాన్ని సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి విపిన్ సంఘి - గత నెల 29న ఓ వివాహానికి వెళ్లేందుకు కారులో బయలుదేరారు. వసంత్ కుంజ్ సమీపంలో విపరీతమైన ట్రాఫిక్ జాంలో ఆయన కారు చిక్కుకుపోయింది. పరిస్థితిని చక్కబెట్టేలా, చుట్టూ ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా కనిపించలేదు. అక్కడి నుంచి ఎప్పుడు బయటపడతామన్న విషయం తెలియని ఆయన, పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు 100కు డయల్ చేశారు. ఫోన్ ఎవరూ ఎత్తలేదు. ఆఫై ఢిల్లీ పోలీసు కమిషనర్ కు ఫోన్ చేయగా ఆయనా ఎత్తలేదు. దీంతో న్యాయమూర్తి దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ప్రజల అవసరాలను తీర్చలేని ఇలాంటి సౌకర్యాలను గాడిలో పెట్టాలని నిర్ణయించుకున్నారు. జరిగిందంతా వివరిస్తూ పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారు. ఆ కాపీని హైకోర్టు చీఫ్ జస్టిస్ జి రోహిణికి పంపారు. న్యాయమూర్తి లేఖను సుమోటోగా తీసుకున్న రోహిణి కేసును విచారించాలని నిర్ణయించి నోటీసులు పంపారు.
దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే అత్యాచారాలు - కిడ్నాప్ లు వంటి నేరాలకు పేరు పడిన నేపథ్యంలో డయల్ 100 ఇంత దారుణంగా ఉండడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే ఈ నంబరుకు ఫోన్ చేసి నిరాశ పడిన అభాగ్యులు ఎందరో ఉన్నారు. దేశవ్యాప్తంగా పోలీస్ హెల్ప్ లైన్ల పరిస్థితి ఇంతేనన్న సంగతి తెలిసిందే. ఒక న్యాయమూర్తికి ఇలాంటి అనుభవం ఎదురుకావడం ఆయన స్పందించి దీనిపై కేసు వేయడంతో ఇప్పటికైనా ఈ హైల్పులైన్ వ్యవస్థ బాగుపడడానికి ఒక మార్గమేర్పడిందని జనం ఆశిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.. న్యాయం గెలుస్తుందో.. న్యాయమూర్తి గెలుస్తారో.. లేదంటే అవ్యవస్థే గెలుస్తుందో చూడాలి.