హైదరాబాద్ లో వైరల్ ఫ్లెక్సీలు: బై బై మోడీ Vs సెలవు దొర

Update: 2022-06-29 11:30 GMT
జులై 2,3 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరవుతున్న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు ముందు బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య కొనసాగుతున్న రాజకీయ యుద్ధం మరింత ముదురుతోంది.

బీజేపీ అత్యున్నత స్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు కమలం పార్టీ జాతీయ నాయకులు 300 మందికి పైగా నగరానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు బహిరంగంగా టార్గెట్‌ చేసుకుంటున్నారు.

గతంలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా 'సాలుదొర... సెలవు దొర', 'కల్వకుంట్ల కౌంట్‌డౌన్‌' అంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించగా.. ఇప్పుడు మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా బహిరంగ వేదికలపై ఫ్లెక్సీలు కట్టడం టీఆర్‌ఎస్ నేతల వంతు వచ్చింది. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఫ్లెక్సీల్లో 'బై బై మోదీ' అని రాసి ఉంది. "సాలు మోడీ...సంపకు మోడీ". అంటూ ఫ్లెక్సీలు దర్శకనమిచ్చాయి.

ప్రధాని మోదీ చిత్రం ఫ్లెక్సీలలో రెండు షేడ్స్‌తో కూడిన అతని ముఖాన్ని ప్రదర్శిస్తుంది. ఫ్లెక్సీలు మోడీ నెరవేర్చని వాగ్దానాలు మరియు అతని వ్యవసాయ చట్టాలను కూడా లక్ష్యంగా చేసుకొని ముద్రించారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంలో విఫలమయ్యాడని.. నోట్ల రద్దు మరియు ఆకస్మిక లాక్‌డౌన్ విధించడం. కంటోన్మెంట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారింది.

పోలీసులు రంగప్రవేశం చేసి కంటోన్మెంట్ అధికారుల సహాయంతో ప్రధానికి వ్యతిరేకంగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ బహిరంగ ఫ్లెక్సీలకు వ్యతిరేకంగా బిజెపి నాయకుల నుండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు.. నిరసనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

హైదరాబాద్ లోని హైటెక్స్ లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని నరేంద్రమోడీ భారీ బహిరంగ సభ జరుగనుంది. సభను విజయవంతం చేసే పనిలో బీజేపీ క్యాడర్ నిమగ్నమైంది. బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో అనుకూల ఫ్లెక్సీలు వెలిశాయి. వీటికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలువడడం విశేషం.
Tags:    

Similar News