తలకు టోపీ.. చేతిలో గన్ను..పట్టుకొని భయం అంటే ఏమిటో తెలీనట్లుగా ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టగలరా? గుర్తు పట్టలేకపోతున్నారా? నిజమే.. ఏ మాత్రం పోలిక లేనట్లుగా ఉన్న కుర్రాడు ఎవరో కాదు.. టీమిండియాలో తన స్ట్రోక్ ప్లేతో ప్రత్యర్థులకు సినిమా చూపించిన విరాట్ కోహ్లీనే ఈ చిన్న కుర్రాడు. టీ 20 ప్రపంచ కప్ తాజా మ్యాచ్ లో ఆసీస్ జట్టుకు చుక్కలు చూపించి.. భారత్ అద్భుత విజయానికి కారణమైన విరాట్ కోహ్లీ ఇప్పుడు అందరి నోట నానుతున్నాడు.
కోహ్లీకి సంబంధించిన వ్యక్తిగత విశేషాలు.. అతని రికార్డులు.. ఫోటోలు.. వీడియోల కోసం నెటిజన్లు విపరీతంగా వెతకటం కనిపిస్తోంది. ఇక.. సోషల్ మీడియాలో ఆదివారం రాత్రి నుంచి కోహ్లీ సందడి నెలకొంది. భారత మీడియాతో పాటు.. ఆసీస్ మీడియా కూడా కోహ్లీ జపం చేయటం గమనార్హం. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ షాడోగా విరాట్ కోహ్లీని పొగిడేస్తున్నారు. ఆసీస్ తో జరిగిన కీలక మ్యాచ్ లో చెలరేగిపోయిన కోహ్లీ ఇప్పుడు హాట్ స్టార్ అనటంలో ఎలాంటి సందేహం లేదు.