ప్రేమను పంచడంలోనూ 'కింగే'..మ్యాచ్ మధ్యలో తిన్నావా అంటూ అనుష్కకు కోహ్లీ సైగలు
విరాట్ కోహ్లీ, నటి అనుష్క ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. వారిద్దరి మధ్య అన్యోన్యత కూడా అంతే. కోహ్లీ ఎక్కడికి వెళ్లినా భార్యను వెంట తీసుకెళుతుంటాడు. ప్రస్తుతం యూఏఈ వేదికగా ఐపీఎల్ టోర్నమెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గర్భిణి అయిన అనుష్కను కూడా విరాట్ కోహ్లీ తన వెంట తీసుకెళ్లాడు. మ్యాచ్ ల విరామంలో ఆ జంట సందడి చేస్తోంది. తాజాగా మైదానంలో మ్యాచ్ ఆడుతుండగానే లాబీలో ఉన్న అనుష్క ను తిన్నావా అంటూ కోహ్లీ సైగలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ ప్రేమ పక్షుల ను అంతా అభినందిస్తున్నారు. ఆదివారం బెంగళూరు చెన్నైసూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ఆ మ్యాచ్ సమయంలో విరాట్ కోహ్లి తన భార్య అనుష్కపై చూపిన ప్రేమ మాత్రం ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
మ్యాచ్ జరుగుతున్న విరాట్ తన సహచరులతో మాట్లాడుతూ లాబీ లో ఉన్న అనుష్క వైపు చూస్తూ తిన్నవా.. అంటూ చేతితో సైగ చేస్తాడు. దానికి అనుష్క స్పందిస్తూ బొటన వేలు చూపుతూ.. తిన్నాను.. అంటూ సైగల ద్వారానే తెలియజేసింది. విరాట్ తన భార్య పట్ల చూపిస్తున్న ఆదరణ పట్ల అభిమానుల ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.దీనికి సంబంధించిన వీడియో ను పరమిందర్ సింగ్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను షేర్ చేస్తూ 'ఈ వ్యక్తిని అందరూ ఇష్టపడటానికి చాలా కారణాలు ఉన్నాయి. మీ ఇద్దరు చాలా క్యూట్ గా ఉంటారు' అంటూ పరమిందర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.