కోహ్లీకి త‌ప్ప‌ని లంచం: సంచ‌ల‌న విష‌యాలు తెలిపిన విరాట్ కోహ్లీ

Update: 2020-05-19 08:50 GMT
భార‌త‌దేశంలో అవినీతి ఎంత పేరుకు పోయిందో అనేది అంద‌రికీ తెలిసిందే. పైసా ఇవ్వ‌నిది ప‌ని.. ఫైల్ ముందుకు వెళ్ల‌ని ప‌రిస్థితి. ఈ జాఢ్యం ఏ ప్ర‌భుత్వాలు వ‌చ్చినా దాన్ని నిర్మూలించ‌క‌పోతున్నాం. ఆ అవినీతి బారిన పేద నుంచి సంప‌న్నులు కూడా ప‌డ్డారు. ఈ అవినీతి అనేది అన్ని రంగాల్లో పాతుకుపోయింది. ముఖ్యంగా క్రీడా రంగంలో పైసా లేనిది ప‌నికి రాదు. ప్ర‌తిభ ఎంతున్నా పైసా వారి చేయి త‌డ‌ప‌నిదే ఉన్న‌త స్థాయికి వెళ్లని ప‌రిస్థితి. అలా చెల్లించుకోని ఎంతోమంది ఆణిముత్యాలు మ‌రుగున ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీకి ఈ అవినీతి ప‌ల‌క‌రించింది. అత‌డిని జ‌ట్టుకు ఎంపిక కోసం లంచం అడిగార‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న విరాట్ కోహ్లీ చేశాడు. అయితే త‌న తండ్రి నిజాయ‌తీ గ‌ల వ్య‌క్తి కావ‌డంతో తాను ఇవ్వ‌న‌ని తేల్చి చెప్పిన‌ట్లు కోహ్లీ వెల్ల‌డించారు.

భారత స్టార్ ఫుట్ ‌బాల‌ర్ సునీల్ చెత్రితో కలిసి కోహ్లీ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా త‌న కెరీర్ ప్రారంభంలో జ‌రిగిన విష‌యాల‌ను పంచుకున్నారు. ఢిల్లీలో కొన్ని సమయాల్లో పనులు నిజాయితీగా జరగవ‌ని, ఉదాహరణకు సెలక్షన్ విషయంలో ఎవరో వ్యక్తి రూల్స్ ప్రకారం వెళ్లలేదని తెలిపారు. అతను త‌న తండ్రితో మెరిట్ ప్రకారం సెలెక్ట్ అవ్వాలంటే.. లంచం ఇవ్వాలని అన్నాడని సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డించారు. అయితే తన తండ్రి అందుకు ససేమీరా ఒప్పుకోలేదని చెప్పాడు.

ఒక విజయవంతమైన లాయర్‌గా త‌న తండ్రి జీవితం గడిపాడ‌ని, అలాంటి వ్యక్తి అదనంగా ఒక్క రూపాయి ఇచ్చేందుకు అంగీకరించ లేదని తెలిపారు. విరాట్‌ని సెలక్ట్‌ చేయాలంటే.. అతడి మెరిట్ ప్రకారం చేయండి నేను అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వనని తేల్చి చెప్పారని కోహ్లీ గుర్తుచేసుకున్నారు. అలా డ‌బ్బులు ఇవ్వ‌క‌పోవ‌డంతో సెలెక్ష‌న్‌లో త‌న పేరు లేద‌ని, దీంతో తాను ఎంతో బాధ‌కు గుర‌‌య్యాన‌ని తెలిపారు.

తన తండ్రికి త‌న‌కు సూపర్‌ హీరో అని, త‌న‌ ఆదర్శం త‌న‌ నాన్న అని, అత‌డి ప్రభావం చాలా ఉందని భావోద్వేగానికి గుర‌య్యాడు. చిన్నప్పుడు క్రికెట్‌ ఆడుతున్నప్పుడు నా కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు అన్ని నాన్నే తీసుకొనేవారని గుర్తు చేసుకున్నాడు. సొంత కష్టంతోనే ముందుకు సాగాలని, మరో మార్గం లేదని నాకు ఆయన వ్యక్తిత్వంతో అర్థమైందని తెలిపారు. నాన్న నిర్ణయాలతో త‌న‌ కెరీర్‌ సులభంగా సాగిందని వివ‌రించారు. బాగా కష్టపడి ముందుకొచ్చాన‌ని, సాకులు చెప్పడం మానేశాన‌ని తెలిపారు. ఇది త‌న తండ్రితోనే సాధ్యమైందని, త‌న జీవితంలో సాధించిన విజయాలన్నీ నాన్న వల్లే జరిగాయని వెల్ల‌డించారు.
Tags:    

Similar News