సిక్సర్ల సెహ్వాగ్ స్టైలే వేరు. అందులోనూ పాకిస్థాన్ పై ఆడితే ఆయన మరింత చెలరేగిపోతారు. కానీ... అభిమానులకు ఇప్పుడు ఆయన ఆట చూసే అవకాశం లేదు. రిటైర్మెంటు ప్రకటించేయడంతో సెహ్వాగ్ ఆటను అంతా మిస్సవుతున్నారు. కానీ.. సెహ్వాగ్ తన పంచ్ డైలాగులతో కొడుతున్న సిక్సులు మాత్రం అలరిస్తున్నాయి. పాక్ ఆటగాళ్లకు షాకిస్తోంది. తాజాగా ఆయన పాక్ మాజీ క్రికెటర్ సక్లయిన్ ముస్తాక్ బర్త్ డే సందర్భంగా ఆయన బౌలింగ్ లో తాను కొట్టిన బ్రహ్మాండమైన సిక్సర్ ను ట్విట్టర్ లో పోస్టు చేశాడు.
సక్లయిన్ ముస్తాక్ ప్రపంచ దిగ్గజ స్పిన్నర్లలో ఒకరన్న సంగతి ఎవరైనా అంగీకరించాల్సిందే. ఎంతోమంది ఇండియన్ బ్యాట్స్ మన్లకు ఆయన ముప్పతిప్పలు పెట్టాడు. ప్రపంచ స్నిన్ చరిత్రలో దూస్రా, తీస్రా వంటి రకరకాల వికెట్ టేకింగ్ బౌలింగ్ టెక్నిక్ లు కనిపెట్టింది కూడా సక్లయినే. అలాంటి సక్లయిన్ నిన్న పుట్టిన రోజు జరుపుకొన్న సందర్భంగా సెహ్వాగ్ ఫన్నీగా విషెస్ చెప్పాడు.
తన ట్విట్టర్ ఖాతా ద్వారా తనదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. డిసెంబర్ 29న 41వ పడిలోకి అడుగుపెట్టిన ముస్తాక్ కు ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ.. 2009, మార్చి 29వ తేదీన ముల్తాన్ లో తాను పాకిస్థాన్ పై చేసిన ట్రిపుల్ సెంచరీని గుర్తు చేశాడు. అంతేకాదు.. ఆ మ్యాచ్‌లో ముస్తాక్ బౌలింగ్ లో తాను సిక్స్ కొట్టి ట్రిపుల్ సెంచరీను పూర్తి చేసుకున్న వీడియోను ఆయన అభిమానులతో పంచుకున్నాడు. ఆ వీడియో లూప్ ను చూస్తూ ముల్తాన్ పుట్టినరోజు వేడుకను ఎంజాయ్ చేసుకోవాలని సలహా ఇచ్చాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/