బీజేపీ ఎంపీగా చాన్స్.. షాకిచ్చిన సెహ్వాగ్

Update: 2019-03-15 11:25 GMT
దేశరాజధాని న్యూఢిల్లీపై కన్నేసిన బీజేపీ మొత్తం స్థానాలను గెలిచేందుకు ఈసారి సెలబ్రెటీలను రంగంలోకి దించాలని ప్లాన్ చేసింది. అందులో భాగంగానే వెస్ట్ ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ను బరిలోకి దించాలని చర్చలు జరిపింది. కానీ బీజేపీ ప్రతిపాదనకు సెహ్వాగ్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాల వల్ల తాను పోటీచేయడం లేదని చెప్పాడట..సెహ్వాగ్ సోదరి ప్రస్తుత వెస్ట్ ఢిల్లీలో బీజేపీ కౌన్సిలర్ గా ఉన్నారు. ఆమె ద్వారా సంప్రదించగా నో చెప్పినట్లు సమాచారం.

ఇక సెహ్వాగ్ నో చెప్పడంతో మరో క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు బీజేపీ గాలం వేసింది. ఆయన అంగీకరిస్తే న్యూఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దింపుతామని తెలిపింది. కానీ గంభీర్ ఏ విషయం తేల్చలేదట.. దీంతో గంభీర్ తోపాటు మౌనికా అరోరా పేరును కూడా పరిశీలిస్తున్నారు.

ఢిల్లీలో లోక్ సభ ఎన్నికలు మే 12న జరుగనున్నాయి. మొత్తం ఢిల్లీ పరిధిలో 7 లోక్ సభ సీట్లున్నాయి. దీంతో వీటిపై కన్నేసిన బీజేపీ ప్రముఖులను బరిలోకి దించాలని యోచిస్తోంది. ప్రస్తుతం వెస్ట్ ఢిల్లీ నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రవేశ్ వర్మ.. నార్త్ వెస్ట్ నుంచి మేయర్ అనిత పేరును బీజేపీ పరిశీలిస్తోంది. మోహన్ సింగ్ బిష్త్, సత్య శర్మలు టికెట్ ఆశిస్తున్నారు. సెలబ్రెటీ క్రికెటర్లు నో చెప్పడం.. గంభీర్ ఆలోచనలో పడడంతో బీజేపీ ఇరుకునపడింది.
Tags:    

Similar News