విశాఖ ఉక్కు.. బీజేపీ మోకాలడ్డు అట!

Update: 2021-03-02 14:42 GMT
ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీకి ఇప్పుడు ‘విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ’ అడ్డుగా మారింది. ఆ అడ్డును తొలగించుకునేందుకు ఏపీ బీజేపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ కేంద్రం దీనిపై మొండి పట్టుదలతో ఉండడంతో ఈ వ్యవహారం నుంచి ఏపీ బీజేపీ నేతలకు ఎదురుదెబ్బలు తప్పడం లేదు.

తాజాగా ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు వేళైంది. విశాఖ మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం ఏపీ బీజేపీ నేతలు తరలివచ్చారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావు సైతం విశాఖకు రాగా ఆయనకు ‘ఉక్కు’సెగ తగిలింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాను ఒప్పుకోనని.. కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించి తీరుతానని ఆయన నిలదీసిన కార్మికులకు సర్ధి చెప్పారు.

విశాఖ రైల్వే జోన్ అభివృద్ధికి కూడా కృషి చేస్తామని జీవీఎల్ చెప్పుకొచ్చారు. విశాఖకు రైల్వే జోన్ కూడా ఇస్తామని.. 170 కోట్ల నిధులను కూడా విశాఖ రైల్వే జోన్ కు కేంద్రం కేటాయించిందని ఆయన సెంటిమెంట్ పై యాంటిమెంట్ పూసే ప్రయత్నం చేశారు.

అయితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం మొండిగా వెళుతుండడంతో ఏపీ బీజేపీ నేతలను ప్రజలు, కార్మికులు నమ్మే పరిస్థితుల్లో కనిపించడం లేదు. ఏపీలో ఎంత మొత్తుకుంటున్నా బీజేపీ నేతల మాటలను ప్రజలు శంకిస్తూనే ఉన్నారు. చిత్తశుద్ధి నిరూపించుకుంటేనే ఏపీ రాజకీయ తెరపై బీజేపీకి బతుకు ఉంటుందని.. లేదంటే కష్టమని అంటున్నారు. 
Tags:    

Similar News