లండన్ మోడీ కోసం ప్ర‌త్యేక పోలీస్‌

Update: 2015-11-12 15:53 GMT
భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న‌లో రాచ‌మ‌ర్యాద‌లు కొన‌సాగుతున్నాయి. ప్రధాని మోడీ బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ తో సమావేశం అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై వారి మధ్య చర్చ జరిగింది. అనంత‌రం లండన్‌ లోని కింగ్‌ ఛార్లెస్‌ స్ట్రీట్‌ లో సైనిక వందనం స్వీకరించారు.

ఈ సంద‌ర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీకి ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. మోడీ బ్రిటన్‌ పర్యటన సందర్భంగా భారత్‌ లోని గుజరాత్‌ కు చెందిన విశాల్‌ గోసాయిన్‌ అనే పోలీసు అధికారికి అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. గుజరాత్‌ కు చెందిన విశాల్‌ బ్రిటన్‌ లో స్థిరపడి పోలీసు ఉద్యోగం చేస్తున్నాడు. రేపు వెంబ్లీ స్టేడియంలో జరిగే ప్రధాని కార్యక్రమానికి పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. విశాల్‌ అక్కడ విధి నిర్వహణలో ఉంటాడు. మోడీ ప్రసంగం వినడానికి వచ్చే భారతీయులతో సంభాషించడం తేలికవుతుందని అధికారులు విశాల్‌ ను నియమించారు. ఈ సందర్భంగా మోడీతో మాట్లాడే అవకాశం వస్తే ఏం మాట్లాడుతావన్న ప్రశ్నకు విశాల్ స్పందిస్తూ..."లండన్‌ లో నివసిస్తున్న భారతీయున్ని నేను.. భారతీయుడైనందుకు గర్విస్తున్నాను. జై భజరంగ్‌ భళీ" అని సమాధానమిచ్చాడు. ప్రధాని మోడీని చూడడానికి తాను, తన కుటుంబ సభ్యులు ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నామని చెప్పాడు.
Tags:    

Similar News