విశాఖలో లీక్ అయ్యింది ఈ గ్యాసే.!

Update: 2020-05-07 05:45 GMT
విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్.జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకై జరిగిన భారీ ప్రమాదం కలకలం రేపింది..  పరిశ్రమ నుంచి లీక్ అయిన రసాయన వాయువు 3 కి.మీల మేర వ్యాపించి ఊపిరి ఆడకుండా చేసింది.. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో ఇప్పటివరకు 8మంది చనిపోయారు. 200 మంది సీరియస్ గా ఉన్నారు. మృతుల సంఖ్య పెరుగుతుందని వైద్యులు తెలిపారు.  గ్యాస్ లీక్ కారణంగా చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు అస్వస్థతకు గురయ్యారు.

ఇక ఈ గ్యాస్ తీవ్రతకు జనాలు అంతా సృహ తప్పి పడిపోయారు. ఏం జరిగిందో తెలిసే లోపే రహదారులు ఇళ్లలో అస్వస్థతకు గురై సృహ తప్పారు. గ్యాస్ లీక్ అయ్యి అది పీల్చి చాలా మంది అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయారు. వీరిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ప్రజలు తీవ్ర భయాందోళనలతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు.

మరి ఇంత పెను విషాదానికి కారణమైన గ్యాస్ ఏమై ఉంటుందన్న చర్చ మొదలైంది. సదురు ఎల్.జీ  కంపెనీ నుంచి ఏం లీక్ అయ్యిందనే దానిపై అధికారులు విచారణ జరిపారు. ఈ కంపెనీ నుంచి లీక్ అయ్యింది ‘పీవీసీ గ్యాస్’ లేదా ‘స్టెరిన్ గ్యాస్’ అంటారని విశాఖ కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు.

ఈ స్టెరిన్ గ్యాస్ చాలా ప్రమాదకరమైనదని నిపుణులు పేర్కొంటున్నారు.  దీన్ని సింథటిక్ రబ్బర్, ప్లాస్టిక్, డిస్పోసబుల్ కప్పులు, కంటైనర్లు, ఇన్సులేషన్ ఇలా పలు ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారని చెబుతున్నారు. ఈ గ్యాస్ కు రంగు ఉండదని.. తీయటి వాసన ఉంటుందని చెబుతున్నారు. వెంటనే బాధితుడికి చికిత్స అందకపోతే ప్రాణాలు పోతాయని చెబుతున్నారు.

గ్యాస్ ను పీల్చగానే వెంటనే  చర్మం లోపలి నుంచి బయటి వరకు మొత్తం మండుతుందని.. దద్దుర్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.  శ్వాసతీసుకోవడంలో చాలా ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు. కంటిచూపుపై ప్రభావం పడుతుందని.. తలనొప్పి, కడుపులో వికారం.. శ్వాస పీల్చుకోవడం కష్టమై బాధితుడు ఉక్కిరిబిక్కిరై ఊపిరి అందక విలవిలలాడుతాడని తెలిపారు. ఈ స్టెరిన్ గ్యాస్ తో పశుపక్ష్యాదులకు డేంజర్ అని తెలిపారు. ఈ గ్యాస్ లీకైన ప్రాంతంలో చెట్లు కూడా నల్లగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.

*డాక్టర్ల సూచనలు
+ స్టెరిన్ గ్యాస్‌ ప్రభావం 48 గంటలు ఉంటుంది
+ గ్యాస్‌ ప్రభావం తగ్గించడానికి కొద్దిగా పాలు తాగండి
+ వీలైనంత ఎక్కువ మంచినీళ్లు తాగండి: డాక్టర్లు
+ కళ్ల మంట అనిపిస్తే ఐ డ్రాప్స్‌ వేసుకోవాలి
+ వాంతి వచ్చినట్టు అనిపిస్తే డోమ్‌స్టల్‌ టాబ్లెట్‌ వేసుకోండి
+ తప్పనిసరిగా మాస్క్‌/తడి గుడ్డ ధరించండి
+ ఇంట్లో ఉన్నా సరే మాస్క్‌ తప్పనిసరి
+ నీరసంగా అనిపిస్తే సిట్రిజన్‌ టాబ్లెట్‌ వేసుకోవాలి


Tags:    

Similar News