ఆమెకు కేబినెట్ హోదా...అందుకేనా ?
మిగిలిన వారికి ఎమ్మెల్యే ప్రోటోకాల్ మాత్రమే ఉంటుంది.
ఏపీ కూటమి ప్రభుత్వం పదిహేను మంది విప్ లను కొత్తగా నియమించింది. అలాగే చీఫ్ విప్ గా జీవీ ఆంజనేయులుకు చాన్స్ ఇచ్చారు. ఇక చీఫ్ విప్ కి కేబినెట్ హోదా ఉంటుంది. మిగిలిన వారికి ఎమ్మెల్యే ప్రోటోకాల్ మాత్రమే ఉంటుంది.
అయితే టీడీపీ తరఫున నియమితులైన పదకొండు మంది విప్ లలో ఆమెకు కేబినెట్ హోదాను ప్రభుత్వం కల్పించింది. ఇంతకీ ఆమె ఎవరు ఏమా ప్రత్యేకత అంటే ఆమె కడప జిల్లాకు చెందిన మహిళా శాసనసభ్యురాలు. రెడ్డప్పగారి మాదవీరెడ్డి. ఆమె ఫైర్ బ్రాండ్ గా పేరు అతి స్వల్ప వ్యవధిలోనే తెచ్చుకున్నారు.
ఆమె వైసీపీకి కంచు కోట లాంటి కడపలో టీడీపీ జెండాను దాదాపుగా పాతికేళ్ళ తరువాత ఎగరేశారు. దాంతో అది టీడీపీకి ఎంతో ఘనమైన విజయంగా మారింది. పైపెచ్చు జగన్ సొంత గడ్డ మీద సాధించిన ఈ విజయం అపూర్వమని టీడీపీలో పెద్దలు సంతోషించారు.
ఇక గెలిచిన తరువాత కడప ఎంపీగా మాధవీరెడ్డి తన దూకుడు ని చూపిస్తూనే ఉన్నారు. జగన్ ని జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే అని ఆమె అభివర్ణించడం తో మొదలెట్టి కడప కార్పోరేషన్ లో ప్రోటోకాల్ రగడ ద్వారా మొత్తం వైరల్ అయ్యారు. ఆమె కేవలం ఎమ్మెల్యేగానే సభకు వచ్చారు. అందువల్ల ఆమెకు మేయర్ పక్కన సీటు వేయనక్కరలేదని ఆ ఎపిసోడ్ లో వైసీపీ నేతలు అన్నారు.
దానికి రిటార్ట్ అన్నట్లుగా ఇపుడు ఆమెకు కేబినెట్ ర్యాంక్ హోదా తో పాటు విప్ పదవి లభించింది. ఇక ఆమె ఏ కార్యక్రమంలో అయినా ప్రోటోకాల్ తోనే హాజరు అవుతారు అని అంటున్నారు. కేబినెట్ ర్యాంక్ అంటే మామూలు విషయం కాదని ఆమె ఇపుడు వైసీపీలో ఏ నేతకు లేని హోదాతో ఉన్నారని అంటున్నారు.
అలా ఆమె ద్వారా కడపలో ఒక బలమైన సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడమే కాకుండా వైసీపీని ఇరుకున పెట్టే రాజకీయానికి తెర తీసే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే టీడీపీలో మంత్రులుగా చేసిన వారు నాలుగైదు సార్లు గెలిచిన వారికి విప్ పొస్టులు ఇచ్చారు. వారంతా కేబినెట్ ర్యాంక్ లేకుండానే ఆ పదవులలో ఉన్నారు. కానీ తొలిసారి ఎమ్మెల్యే అయినా మాధవీరెడ్డికి ఈ హోదా దక్కడం అంటే గ్రేట్ అంటున్నారు.
దానికి ఆమె ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్ తో పాటు కడప వంటి ప్రాంతం కూడా వెనక ఉండడం ప్లస్ అయింది అని అంటున్నారు. మరి తనకు ఇచ్చిన కేబినెట్ హోదాతో పాటు తన మీద టీడీపీ అధినాయకత్వం పెట్టుకున్న ఆశలను మాధవీరెడ్డి ఎంత మేరకు నెరవేరుస్తారో చూడాల్సి ఉంది అని అంటున్నారు.