విశాఖపట్నం జిల్లా ఆర్ ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి స్టెరీన్ గ్యాస్ లీకేజ్ అయిన సంఘటన లో 12 మంది మరణించారు. అలాగే వందలాదిమంది అస్వస్థతకి గురైయ్యారు. అయితే, ప్రస్తుతం స్థానికంగా వాతావరణంలో స్వచ్ఛమైన ఆక్సిజన్ శాతం పెరిగింది. ఇప్పుడు అంతా హాయిగా గాలి పీలుస్తున్నారు. ఆ కంపెనీ లోకి ఉద్యోగులు కూడా వెళ్తున్నారు. నేతలు - అధికారులు అసలేం జరిగిందో ఆరా తీయడం మొదలైంది. అయినా ఏదో తెలియని భయం. ఆ రోజు జరిగిన సంఘటనే ఇటు ఉద్యోగులు - అటు బాధితుల కళ్ల ముందు కదులుతోంది.
గ్యాస్ కంపెనీ పేరుతో చెబితే ఆ గ్రామస్థుల వెన్నులో వణుకు పుడుతోంది. అమ్మో అనే పరిస్థితి. అసలు ఊపిరాడం లేదు - ఆ రాత్రి ఏం జరిగిందో గుర్తుకు వస్తే చాలు నిద్ర పట్టడం లేదు. ఆ గాలిని పీల్చి కోలుకున్న వారు తమ ఊరికి వెళితే అక్కడి నీరు తాగవచ్చా..పండ్లు - ఫలాలు - ఆహార పదార్థాలు తినవచ్చా - పాలు తాగవచ్చా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.స్టెరీన్ గ్యాస్ లీకేజ్ వల్ల అక్కడ అంతా పాలిమర్ రూపంలో అణువులు నిక్షిప్తమయ్యాయి. అవి పడ్డ ఏ ఆహార పదార్థం తినడానికి మంచిది కాదు అని నిపుణులు చెప్తున్నారు. అలాగే చెరువులు - కుంటలు - బావులు - తటాకాల్లో ఉన్న తాగునీరు పనికి రాదు. ఆకుకూరలు - కూరగాయాలు - పంటలు తినేందుకు అనువుకాదు. అయితే , వాటిల్లో ఎంత శాతం ఈ గ్యాస్ ఉందనేది పరీక్షలు జరిపాకనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు మరో అనుమానం అక్కడి రైతులను పట్టి పీడిస్తోంది. అదే అక్కడున్న జంతువుల పరిస్థితి ఏంటి.
5 వందల వరకు ఫశువులు ఆ గ్రామాల్లో ఉండగా…20కి పైగా పశువులు చనిపోయాయి. మరో 3 వందల పశువుల పై గ్యాస్ ప్రభావం బలంగా పడింది. కొన్నింటికి కాళ్లు పని పని చేయడం లేదు. మరికొన్నింటికి కళ్లల్లో గ్యాస్ పడి చూపు పోయింది. వైద్యులు అహర్నిశలు పని చేస్తు విరుగుడు వాటికి ఇంజెక్షన్లు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు అక్కడి గడ్డిలోను పాలిమర్ ఉంది. కాబట్టి పశువులకు పచ్చి గడ్డి, ఎండుగడ్డి మేతగా వేయరాదని చెబుతున్నారు పశువైద్యులు. అంతే కాదు స్టెరీన్ గ్యాస్ ను పీల్చిన గేదెల నుంచి తీసే పాలను నెల రోజుల వరకు తాగవద్దని హెచ్చరిస్తున్నారు. పశువులు ఆ గాలి పీల్చడంతో కడుపులో ఇంకా పాలిమర్ నిక్షేపాలు ఉంటాయి. అందుకే వాటి పాలు అసలు తాగవద్దని చెబుతున్నారు. అలాగే ఆ గ్రామాల్లో పెరిగే కోళ్లను కానీ , మేకలు , పొట్టేళ్లను కానీ కొన్ని రోజుల పాటు తినవద్దు అని తెలియజేసారు. ఇందుకు విరుద్దంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో ఇబ్బంది పడక తప్పదు అని వారు చెప్తున్నారు.
పూర్తిగా ఆ ప్రాంతాన్ని స్టెరిలైజ్ చేస్తే తప్ప యధాతథ స్థితికి రాదు. ఇళ్ల పై పెద్ద మొత్తంలో నీరు చల్లడంతో పాటు రసాయానాలతో ఇళ్లను శుద్ది చేస్తేనే అక్కడకు వెళ్లే వీలుంది. అప్పటి వరకు శిబిరాల్లోనే ప్రజలు ఉండాల్సి ఉంది. ఇప్పుడు వారి ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. హడావుడిగా శిబిరాల నుంచి వారిని ఇళ్లకు పంపితే ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని…నిపుణుల కమిటీ నివేదికలు వచ్చాక..వారు చెప్పే దాన్ని బట్టి ఎప్పుడు పంపుతారనేది ఆధారపడి ఉంది.
అసలే కరోనా. ఆపై లాక్ డౌన్. పులిమీద పుట్రలా ఇప్పుడు గ్యాస్ లీకేజ్. ఇలాంటి సమయంలో తమ ఇళ్లల్లో దొంగలు పడటం మరింతగా బాధితులను ఆందోళన గురిచేస్తోంది. గ్యాస్ లీకేజ్ తో చాలా మంది తమ ఇళ్లకు తాళాలే కాదు… తలుపులు సరిగా వేయలేదు. ఇంత కంటే మంచి సమయం దొరకదనుకున్న చోరులు ఇళ్లను లూటీ చేస్తున్నారు. ఇటు డబ్బులు, అటు విలువైన ఆభరణాలు - వస్తువులను దోచుకెళుతున్నారు. తమ ఇళ్లల్లో ఎక్కడ దొంగలు పడుతున్నారనే కారణం తో ఊరికి వెళ్లే ఆలోచన చేయవద్దంటున్నారు నిపుణులు. మంత్రులు కూడా అదే చెప్పారు. ఏదో జరుగుతుందని తొందరపడి ఇంటికి వెళితే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుందంటున్నారు. మరో వైపు ఇప్పుడా ఊళ్లల్లో పోలీసు నిఘాను మరింతగా పెంచారు.