పూర్వం దొరలు- జమీందార్ల పాలన ఉండేది. వాళ్లు బ్రాహ్మణులను తమ చెప్పు చేతల్లో ఉంచుకునేవారు. వారు వీళ్లకు అణిగిమణిగి ఉండేవారు. దొరలు- జమీందార్ల వ్యవస్థలో తమకు అనుకూలంగా ఉన్న వారిని నెత్తిన పెట్టుకునేవారు. ఇక వీరి అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారికి చుక్కలు చూపించేవారు.. సామాజికంగా ఒంటరి చేసేవారు.. ఇప్పుడు కేసీఆర్ సర్కారులోనూ అదే తీరు పునావృతం కావడం యాధృశ్చికమే అయినా ఇప్పుడు ఈ ధోరణిపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
కొద్దిరోజులుగా జైళ్ల శాఖ ఐజీగా కీలక సంస్కరణలు చేసి జైళ్ల రూపురేఖలే మార్చేశారు వీకే సింగ్. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు- ఖైదీలకు శిక్షణలు, ఉపాధి మార్గాలు, వారికి జైల్లోనే కర్మాగారాలుగా మార్చి అందరికీ చేరువయ్యారు. అయితే ఇదంతా ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయాలు.. ప్రభుత్వాన్ని సంప్రదించి కానీ.. పోలీస్ బాస్ అనుమతి తీసుకొని చేసింది కాదు. అందుకే ఇప్పుడు కేసీఆర్ సర్కారు ఆగ్రహానికి గురై లూప్ హోల్ పోస్టు అయిన స్టేషనరీ, ప్రింటింగ్ కమిషనర్ కు చేరుకున్నారు. నీతిమంతులైన తన లాంటి వాళ్లకు తెలంగాణలో బతుకు లేదని.. బంగారు తెలంగాణ ఈ రాజకీయాలతో అసాధ్యమని తాజాగా వీకే సింగ్ చెప్పుకొచ్చాడు.
కేసీఆర్ ఈ ఒక్క అధికారి విషయంలోనే కాదు.. ఇది వరకు కూడా ఇలానే స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్న వారిని ఎటూ కాకుండా చేసిన చరిత్ర ఉందని రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. తొలి తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ మాట వినకుండా డిప్యూటీ సీఎం హోదా రాజయ్య చేసిన హడావుడి అంతా ఇంతాకాదు. దీనికి సీరియస్ అయిన కేసీఆర్ అతడిని డిప్యూటీ సీఎం పోస్టు నుంచి తొలగించేశారు. ఇక ఆ తర్వాత కడియం శ్రీహరిని తీసుకున్నారు. శ్రీహరి కూడా సీనియర్ కావడంతో విద్యాశాఖలో స్వతంత్రంగా వ్యవహరించారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఇప్పుడు ఆయనకు ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కకుండా రాజకీయాలకు దూరమైపోయారు.
ఇలా కేసీఆర్ రాజ్యమిదీ. ఈ ఇలాకాలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయన చెప్పినట్టే చేయాలి. స్వతంత్రులుగా పనిచేస్తే గడ్డుకాలమే అని చరిత్ర చెబుతోంది. మరీ ఈ పోకడలు అంతిమంగా కేసీఆర్ కు ఎలాంటి నష్టం చేకూరుస్తాయి.? ప్రతిపక్షాలకు ఆయుధమవుతాయా అన్నది వేచిచూడాలి.