వరంగల్ లోక్ సభా స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఓటింగ్ జోరుగా సాగుతోంది. కడపటి సమాచారం ప్రకారం భారీ పోలింగ్ దిశగా సాగుతోంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ నాటికే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రావటం కనిపించింది. తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహంగా రావటంతో ఉదయం 11 గంటలకు 27.6 శాతం ఓటింగ్ నమోదైంది.
మధ్యాహ్నం 12 గంటల సమయానికి 40 శాతం వరకు నమోదైంది. కేవలం గంట వ్యవధిలో దాదాపు 13 శాతం పోలింగ్ జరగటం విశేషం. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట సమయానికి దాదాపుగా 50 శాతానికి టచ్ అయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వరకు ఉన్న జోరును చూస్తే.. భారీ పోలింగ్ దిశగా వరంగల్ ఉప ఎన్నిక సాగేటట్లుగా కనిపిస్తోంది. ఉదయం కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. అయితే.. వాటిని సరి చేసిన అధికారులు పోలింగ్ మొదలు పెట్టారు. ముందుగా అనుకున్నట్లే సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ సాగనుంది. ఇప్పటివరకూ జరిగిన పోలింగ్ నేపథ్యంలో.. పోలింగ్ పూర్తయ్యేసరికి భారీ ఎత్తున పోలింగ్ జరగటం ఖాయమంటున్నారు. మరి.. ఉదయం చూపించిన ఉత్సాహం సాయంత్రం వరకూ కొనసాగుతుందో లేదో చూడాలి. ఓటర్లు నిక్షిప్తం చేస్తున్న తీర్పు ఈ నెల 24న బయటకు రానుంది.