ఆయనో ఎంపీ. తన బాల్యంలో జరిగిన లైంగిక హింస గురించి ఏకంగా పార్లమెంటులో చెప్పేందుకు వెనుకాడలేదు. తనకెదురైన చేదు జ్ఞాపకాన్ని వెల్లడించిన ఆయన సంచలనం సృష్టించారు. చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలపై జరిగిన చర్చ సందర్భంగా తన ఉదంతాన్ని వెల్లడించేందుకు ఆయనేమాత్రం వెనక్కి తగ్గలేదు. తన తీరుతో సంచలనంగా మారారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్. ఆయన ప్రదర్శించిన ధైర్యానికి కేంద్రమంత్రితో సహా పార్లమెంటులోని పలువురు ఎంపీలు ప్రశంసలు అందుకున్నారు.
పిల్లలపై జరిగే లైంగిక నేరాల నుంచి రక్షించే పోక్సో చట్ట సవరణపై జరిగిన చర్చ సందర్భంగా ఎంపీ డెరెక్ మాట్లాడుతూ.. చిన్నపిల్లలపై లైంగిక హింస ఇంటి నుంచే మొదలువుతుందన్నారు. పబ్లిక్ లైఫ్ లో ప్రజలంతా దీని గురించి ధైర్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు.
అప్పుడే చిన్నపిల్లలకు ఈ విషయాలపై ఒక అవగాహన కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా తన జీవితంలో తనకెదురైన చేదు జ్ఞాపకం గురించి ఆయన చెప్పుకొచ్చారు. తనకు పదమూడేళ్ల వయసులో తనపై లైంగిక హింస జరిగిందన్న షాకింగ్ నిజాన్ని వెల్లడించారు.
తనకు జరిగిన లైంగిక హింస గురించి తన ఇంట్లో తెలుసని.. ప్రజలకు చెప్పటానికి తాను భయపడటం లేదన్నారు. బాధాకరమైన ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవటం ద్వారా దేశానికి తెలియాల్సిన విషయాలు ఉన్నాయన్న ఆయన.. 13 ఏళ్ల వయసులో తాను టెన్నిస్ ఆడి వస్తుంటే.. ఒక వ్యక్తి తనను లైంగికంగా హింసించారన్నారు. ఆ సమయంలో తాను చిన్న నిక్కరు.. టీషర్టు వేసుకున్నట్లు వెల్లడించారు.
తానీ విషయాన్ని చెప్పకూడదనుకున్నానని.. కాకుంటే చిన్నారులపై జరిగే లైంగిక హింస గురించి అందరూ తెలుసుకోవటం.. బహిరంగంగా దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని.. అందుకే తన ఉదంతాన్ని తాను వెల్లడించినట్లు చెప్పారు. ఏమైనా.. తృణమూల్ ఎంపీ ధైర్యాన్ని అభినందించాల్సిందే.