మునుగోడు నియోజకవర్గంలో తనకు తిరుగు లేదన్నట్లుగా ఉండే కోమటిరెడ్డిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తనకు ఏ మాత్రం సరిపోయే అభ్యర్థి కాని కూసుకుంట్ల మీద ఆయన ఇప్పుడు పోటీకి ఆయాసపడాల్సి వస్తోంది. దీనికి కారణం.. ఇప్పుడు ఆయన పోటీ పడుతోందిన కూసుకుంట్లతో కాదు.. ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోనూ.
గడిచిన రెండు దఫాలుగా ఉపపోరులోతగిలిన ఎదురుదెబ్బల నేపథ్యంలో.. ఈసారి ఎలాంటి తప్పులు జరగకూడదన్న పట్టుదలతో సీఎం కేసీఆర్ ఉన్నారు. అందుకు తగ్గట్లే ఆయన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఉంటున్నారు. ఉప పోరు కోసం ఏకంగా 86 మంది ప్రజా ప్రతినిధుల్ని నియమిచటం ద్వారా.. ఉప పోరు విషయంలో తానెంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారు. ఒక విధంగా చెప్పాలంటే అధికారపక్షానికి చెందిన కీలక నేతలు మొత్తం మునుగోడును కమ్మేసిన పరిస్థితి.
ఇలాంటి వేళ.. ప్రతి విషయం ఎంతో కొంత ఉప ఎన్నిక ఫలితాన్ని ప్రభావితం చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ప్రారంభంలోనే కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తనకు రూ.18వేల కోట్ల కాంటాక్టులు లభించాయని చెప్పటం ద్వారా సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. ఈ ఉప ఎన్నిక విసయంలో బలమైన నినాదాన్ని ఓటర్లలోకి తీసుకెళ్లాలని తపించిన గులాబీ బాస్ కు.. కోమటిరెడ్డి మాటలు బందర్ లడ్డూ మాదిరిగా మారాయి.
ధనబలానికి.. తెలంగాణ ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరుగా దీన్ని అభివర్ణించటం మొదలు పెట్టారు తెలంగాణ ఆత్మగౌరవం అంశాన్ని పక్కన పెడితే.. కోమటిరెడ్డి ధన బలాన్ని నెగిటివ్ గా చూపించే విషయంలో గులాబీ నేతలు సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. ఈ ఉప ఎన్నికకు సంబందించి ఇదో పెద్ద మైనస్ పాయింగ్ గా చెబుతున్నారు. తన నోటి నుంచి వచ్చిన మాటలే కోమటిరెడ్డిని ముంచపోతున్నట్లుగా చెబుతున్నారు.
తన నోటి నుంచి వచ్చిన మాటల డ్యామేజ్ నుంచి బయటకు వచ్చేందుకు తెగ ప్రయత్నిస్తున్న ఆయన.. కొంతమేర సఫలం అయినప్పటికీ.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు మళ్లీ ఆయన్ను ఇరుకున పడేలా చేశాయంటున్నారు. కోమటిరెడ్డి సంస్థ నుంచి ఐదు కోట్లకు పైగా నిధులు ఇతర ఖాతాలకు జమ అయ్యాయని అధికారపార్టీ ఆరోపించటమే కాదు.. దీనికి సంబంధించి స్క్రీన్ షాట్లను బయటకు తీసుకురావటంలో సక్సెస్ అయ్యింది. దీంతో.. కోమటిరెడ్డి మరోసారి ఇరుకున పడే పరిస్థితి. ఈ వివాదం కొనసాగుతుండగా..
గుర్తు తెలియని వ్యక్తుల అకౌంట్ నెంబర్ల నుంచి కొంత మంది ఖాతాలకు నగదు బదిలీ కావటం ఇప్పుడు కొత్త కలకలానికి తెర తీసింది. ఈ మొత్తం పరిణామాలు కోమటిరెడ్డికి అపశకునాలుగా అభివర్ణిస్తున్నారు. అయితే.. అదంతా టీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారంగా బీజేపీ నేతలు కొట్టేస్తున్నారు. ఈ పరిణామాలు కోమటిరెడ్డికి మైనస్ గా మారతాయా? అన్నది తుది ఫలితం తేల్చనుందని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.