ఏడు ముస్లిం మెజార్టీ దేశాలపై ట్రంప్ సర్కారు విధించిన బ్యాన్ పై మరో కోర్టు స్పందించింది. అమెరికా అధ్యక్షుడి నిర్ణయాన్ని నిలువరిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేయటమే కాదు.. తాము తీసుకున్న నిర్ణయం దేశం మొత్తానికి వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఏడు ముస్లిం మెజార్టీ దేశాల పౌరులు అమెరికాకు వచ్చే విషయంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని విభేదిస్తూ.. వాషింగ్టన్ రాష్ట్ర అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గూసన్ పిటీషన్ ను విచారించిన న్యాయమూర్తి ట్రంప్ నిర్ణయాన్ని తప్పు పట్టారు.
తాజా ఆదేశాల అనంతరం స్పందించిన ఫెర్గూసన్ మాట్లాడుతూ.. తాజా ఆదేశాలతో రాజ్యాంగం విజయంసాధించిందని.. అమెరికా అధ్యక్షుడితో సహా ఎవరూ చట్టానికి అతీతులు కాదన్న విషయం మరోసారి రుజువైందని వ్యాఖ్యానించారు. ప్రజలపై మతపరమైన వివక్ష ను ప్రదర్శించటం.. నిషేధం విధించటం రాజ్యాంగానికి విరుద్దంగా అటార్నీ జనరల్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ తీసుకున్న బ్యాన్ నిర్ణయంపై ఇప్పటికే డిస్ట్రిక్ట్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేయటం తెలిసిందే. టెక్ కంపెనీ దిగ్గజాలు సైతం.. ట్రంప్ నిర్ణయాన్ని తప్పు పట్టాయి. మరోవైపు.. దేశ వ్యాప్తంగా ప్రజలు.. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆందోళనలు.. నిరసనలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఒకరి తర్వాత ఒకరుగా ట్రంప్ తీరును తప్పు పట్టేలా గళం విప్పుతున్నారు. రానున్న రోజుల్లో మరెన్ని నిరసన గళాలు బయటకు వస్తాయో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/