మహా దాహాం; నీళ్ల రైలు లాతూరుకు చేరుకుంది

Update: 2016-04-12 06:56 GMT
నీళ్ల కోసం యుద్ధాలు వస్తాయని చెప్పినప్పుడు నవ్వుకున్న వాళ్ల ఎందరో ఉన్నారు. కానీ.. ఆ మాటలో నిజం ఎంతన్నది ఇప్పటికే అర్థమైన పరిస్థితి. భవిష్యత్తులో మరెంత దారుణ పరిస్థితులు ఉంటాయన్నది ఊహించటానికి కూడా భయమేసే పరిస్థితి. నీటి ఎద్దడి రోజురోజుకీ పెరగటం ఒక ఎత్తు అయితే.. నీళ్ల చుక్క కోసం పరితపించే ప్రాంతాలు ఇప్పుడు చాలానే ఉన్నాయి. అయితే.. వీటన్నింటికి మించి నీళ్ల కోసం మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతం పడుతున్న కష్టం చూసిన దేశం అవాక్కు అయ్యే పరిస్థితి. తాగేందుకు నీళ్లు లేక అక్కడి ప్రజలు పడుతున్న వెతలు చూసిన వారంతా షాక్ తింటున్నారు.

లాతూర్ దాహాన్ని తీర్చటానికి ఒక రైల్లో నీళ్లను తీసుకురావాల్సి వచ్చింది. నీళ్లతో బయలుదేరిన రైలు లాతూరు మంగళవారం చేరుకుంది. లాతూర్ కి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిరాజ్ రైల్వే స్టేషన్ నుంచి నీళ్లను నింపుకున్న రైలు.. మంగళవారం ఉదయానికి చేరుకుంది.

తొలుత ఈ రైలు ద్వారా 50 వ్యాగన్లలో నీళ్లను తీసుకురావాలని ప్రయత్నించారు. దూరం ఎక్కువగా ఉన్న కారణంగా అన్ని వ్యాగన్లతో నీళ్లను తీసుకురాలేక.. కేవలం 10 వ్యాగన్లతోనే నీళ్లను తీసుకొచ్చారు. మళ్లీ మరో రైలుతో నీళ్లను తెస్తామని చెబుతున్నారు. తాజాగా వచ్చిన నీళ్ల రైలుతో లూతురు నీళ్ల కష్టాలు ఒక మోస్తరుగా తీరే అవకాశం ఉందని చెబుతున్నారు. లాతూరు నీళ్ల కష్టం చూస్తే.. మిగిలిన వారి నీళ్ల కష్టాలు ఏపాటివి కదూ..?
Tags:    

Similar News