నిజాలు బయటకు రావాలిః వైఎస్ భాస్కర్ రెడ్డి

Update: 2019-03-17 12:38 GMT
వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో సిట్ విచారణకు హాజరయ్యారు వైఎస్ భాస్కర్ రెడ్డి. వైఎస్ వివేకానందరెడ్డికి సోదరుడు అయ్యే భాస్కర్ రెడ్డి, కడప తాజా మాజీ ఎంపీ అవినాష్ రెడ్డికి తండ్రి కూడా. ఈ రోజు భాస్కర్ రెడ్డితో పాటు.. వైఎస్ కుటుంబీకులు మరో ఇద్దరు సిట్ విచారణకు హాజరయ్యారు.

పులివెందుల్లో సాగుతున్న ఈ విచారణ పై వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ ప్రతాపరెడ్డిలు విచారణకు హాజరు అయ్యారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యనంతరం తొలి తొలిగా అక్కడకు చేరుకున్న వారిగా వీరి పేర్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరి విచారణ ఆసక్తిదాయకంగా నిలుస్తూ ఉంది. సిట్ విచారణ అనంతరం.. వైఎస్ భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిట్ అధికారులకు మీరేం చెప్పారనే అంశంపై ఆయన మాట్లాడారు.

‘నిజాలు బయటకు రావాలి.. ‘అని వైఎస్ భాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘వైఎస్ వివేకానందరెడ్డి గారు అత్యంత సౌమ్యులు, ఆయన హత్యకు గురి కావాల్సిన వ్యక్తి కాదు.. అలాంటి ఆయన హత్య విషయంలో సరైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. సీబీఐ విచారణ మొదట్లోనే మొదలు అయితే బావుండేది. ఇప్పుడు సిట్ విచారణ సాగుతూ ఉంది. దీని గురించి మీకే బాగా తెలుసు. నిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నాము..’అని భాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

‘ఈ కేసులు మీ కుటుంబం మీదే తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది.. ఇది వరకూ ఏదో గొడవ జరిగిందని, అందుకు పర్యావసనమే ఈ హత్య అని టీడీపీ అంటోంది, ఈ హత్యలో మీ తనయుడు అవినాష్ రెడ్డి హస్తముందని టీడీపీ అంటోంది..’అనే కఠినమైన ప్రశ్నలకు కూడా భాస్కర రెడ్డి సమాధానాలు ఇచ్చారు. గొడవగా చెప్పబడుతున్న అంశం పెద్దది కాదు అని.. అది చాలా చిన్నది అని.. అని భాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసులో అసలైన వాస్తవాలు బయటకు రావాలని, అదే తమ ఆకాంక్ష అని.. వైఎస్ భాస్కర్ రెడ్డి సూటిగా స్పష్టంగా చెప్పారు.
Tags:    

Similar News