ముంబైలో సంచలనం: మాస్క్‌ లేకుండా తిరిగితే జైలు

Update: 2020-04-08 16:30 GMT
కరోనా బారిన భారతదేశం తీవ్రంగా ప్రభావితమవుతోంది. రోజురోజుకు కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఆ ఒక్క రాష్ట్రంలోనే వెయ్యికి పైగా కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. వేలాది మంది అనుమానితులు క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక దేశ ఆర్థిక రాజధానిగా.. దేశంలోనే అతి పెద్ద నగరంగా ఉన్న ముంబై మహానగరంలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఈ ఒక్క నగరంలోనే 800కు పైగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ముంబైలో లాక్‌ డౌన్‌ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ప్రజలను బయటకు రానివ్వడం లేదు. ఒకవేళ అత్యావసర పరిస్థితుల్లో బయటకు వస్తే తప్పనిసరిగా ముఖానికి మాస్క్‌ ధరించాలని అక్కడి అధికారులు చర్యలు తీసుకున్నారు. మాస్క్‌ ధరించకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందంట. ఈ మేరకు కఠిన నిర్ణయాలు తీసుకోవడం తో పాటు ప్రజల రాకపోకలపై తీవ్ర ఆంక్షలు విధించారు.

తాజాగా కరోనా వైరస్ హాట్‌ స్పాట్‌ గా ప్రకటించిన ముంబై మహా నగరం ప్రకటించిన విషయం తెలిసిందే. మహానగరంలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ముంబై మునిసిపల్ అధికారులు నిర్ణయించారు. మాస్క్‌ ధరించకుండా బయటకు వచ్చి నిబంధనలు ఉల్లంఘించిన వారిని తక్షణమే అరెస్టు చేస్తామని ప్రకటించారు. 2 కోట్లకు పైగా జనాభా ఉన్న మహానగరం ముంబై. ఈ మహానగరంలో ప్రస్తుతం కరోనా తాండవిస్తోంది. ఏకంగా 782 కరోనా కేసులు నమోదు కాగా దాదాపు 50 మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలు ఆ వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్త చర్యలు ముంబై మున్సిపాలిటీ చర్యలు తీసుకుంది.

దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై మహారాష్ట్ర రాజధానిగా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మహానగరంలో కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు అక్కడి మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపడుతున్నారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో మహారాష్ట్రలో ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్‌ డౌన్ చర్యలను పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Tags:    

Similar News