ఊరి ప్రెసిడెంట్ గారు పక్క ఊరి కి వెళ్లినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పే సామెత తెలుగు వారి కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రం కాని రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాని కి చెందిన ముఖ్య మంత్రి వెళ్లినప్పుడు ఎలాంటి స్వాగత సత్కారాలు లభిస్తాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు వెళ్లిన సందర్భంగా ఆయనకు సాదర స్వాగతం లభించటం తెలిసిందే.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. స్వయంగా వచ్చి.. ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలకటమే కాదు.. వీడ్కోలు సమయం లోనూ కిందకు వచ్చి మరీ బై చెప్పి వెళ్లారు. రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీలు చాలానే ఉన్నా.. వీరి మధ్య జరిగిన భేటీ మాత్రం సహృద్భావ వాతావరణం లో జరిగిన విషయం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వైఎస్ జగన్ భువనేశ్వర్ పర్యటన సందర్భంగా ఆయనకు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం పలికిన వైనం అందరిని ఆకర్షించింది.
విశాఖ ఎయిర్ పోర్టు నుంచి భువనేశ్వర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు.. అక్కడి తెలుగు వారు సాదర స్వాగతం పలకటమే కాదు.. వారి ప్రతినిధులు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టు నుంచి ఒడిశా ప్రభుత్వ గెస్టు హౌస్ వరకు తీసుకెళ్లారు. ఆ సందర్భంగా ఎయిర్ పోర్టు నుంచి గెస్టు హౌస్ మధ్యలో దారి పొడువునా 80 ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం పలికారు. ఈ హడావుడికి కారణం కోసలాంధ్ర కల్చరల్ అసోసియేషన్ తో పాటు భువనేశ్వర్ ఆంధ్రా కల్చరల్ సమితి.. కటక్ ఐక్యత స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేశారు. మొత్తంగా జగన్ ఒడిశా పర్యటనలో ఆయనకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఆయనకున్న ఇమేజ్ కు ఇదో నిదర్శనమన్న మాట వినిపిస్తోంది.