అయోమయంలో బెంగాల్ ఓటర్లు

Update: 2021-04-28 12:30 GMT
పశ్చిమబెంగాల్ ఓటర్లను చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. ఎందుకంటే మమతబెనర్జీ ఆధ్వర్యంలోని  తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, మోడి నేతృత్వంలోని బీజేపీల్లో దేన్ని ఎంచుకోవాలో అర్ధంకాక ఓటర్లు అయోమయంలో పడిపోయారట. ఓటర్లలో ఇంతటి అయోమయం దేనికంటే రెండుపార్టీలపైన విపరీతమైన వ్యతిరేకతుంది. మామూలుగా అయితే అధికారపార్టీపై ఉన్న వ్యతిరేకత వల్ల ప్రధాన ప్రతిపక్షం లాభపడుతుంది.

అలాగే  ప్రతిపక్షాల్లోని అనైక్యత, ప్రతిపక్షాల్లోని  నాయకత్వ కొరత వల్ల అధికారపార్టీయే లాభపడుతుంది. కానీ ఇక్కడ పరిస్దితులు విచిత్రంగా ఉన్నాయి. మమత మీద జనాల్లో ఎంత వ్యతిరేకత ఉందో నరేంద్రమోడి మీద కూడా జనాల్లో అంతే వ్యతిరేకత ఉందట. ప్రభుత్వంలో అవినీతి, పార్టీ నేతల దోపిడి లాంటి చర్యల వల్ల మమతపై జనాల్లో వ్యతిరేకత వచ్చిందని విశ్లేషకుల అభిప్రాయం.

ఇదే సమయంలో కరోనా వైరస్ ను నియంత్రించటంలో కేంద్రం విఫలమవ్వటం, ఫిరాయింపులను ప్రోత్సహించటం, బీజేపీ నేతల అరాచకాలు, బెంగాల్ పై కేంద్రం పెత్తనం లాంటి అనేక కారణాల వల్ల మోడి అంటేకూడా జనాల్లో బాగా కోపం ఉందట. అంటే అనేక కారణాల వల్ల ఇటు మమత అటు మోడి ఇద్దరిపైనా జనాల్లో వ్యతిరేకతుందన్నది అర్ధమైపోతోంది.

సరే వీళ్ళద్దరిని వద్దనుకుని వేరే పార్టీలకు ఓట్లేద్దామని జనాలు అనుకున్నా ఓట్లేయించుకునే స్ధితిలో ఆ పార్టీలు లేవు. లెఫ్ట్+కాంగ్రెస్+ముస్లిం ఫ్రంట్ వైపు ఎంతమంది ఓటర్లు మొగ్గుచూపారనే విషయంలో క్లారిటి లేదు. క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను బట్టి మమత లేదా బీజేపీకి మాత్రమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనిపిస్తోంది. కాబట్టే అధికారం కోసం రెండుపార్టీల మధ్య అంతలా వార్ జరిగింది. మరి ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపారో మే 2వ తేదీన తేలిపోతుంది.
Tags:    

Similar News