ఏపీలో టీఆర్ ఎస్ పోటీ చేసే స్థానాలు ఇవేనా?

Update: 2021-10-26 23:30 GMT
``ఏపీ ప్ర‌జ‌లు పిలుస్తున్నారు. `` అంటూ.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న నేప థ్యంలో ఏపీలోనూ టీఆర్ ఎస్ పార్టీని పెడ‌తారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఒక‌వేళ పెడితే.. ఏయే స్థానాల్లో ఈ పార్టీ పోటీ చేసే అవ‌కాశం ఉంటుంది? అనే ఊహాగానాలు కూడా కొన‌సాగుతున్నాయి. వాస్త‌వానికి ఇప్ప‌టి ప్ర‌క‌ట‌న నిజానికి పాత‌దే. గ‌తంలో టీఆర్ ఎస్ యువ‌నాయ‌కుడు.. కేటీఆర్ కూడా అనేక సంద‌ర్భాల్లో ఏపీలోనూ త‌మ‌కు అభిమానులు ఉన్నార‌ని.. అక్క‌డ కూడా పార్టీ పెట్టాల‌ని.. కోరుతున్నార‌ని.. చెప్పుకొచ్చారు. అంతేకాదు.. విజ‌య‌వాడ పీడ‌బ్ల్యుడి గ్రౌండ్‌లో తాము స‌భ పెడ‌తామ‌ని కూడా ప్ర‌క‌టించారు.

అయితే..ఇప్పుడు సాక్షాత్తూ తెలంగాణ ముఖ్య‌మంత్రి నోట‌.. ఏపీ ప్ర‌జ‌లు పిలుస్తున్నారంటూ.. వ‌చ్చిన పిలుపుతో.. ఎప్ప‌టికైనా టీఆర్ ఎస్ .. ఏపీలో వేలు పెట్ట‌డం ఖాయ‌మ‌నే సూచ‌న‌లు ఇచ్చిన‌ట్టు అయింది. ఇలా.. రేపు ఒక‌వేళ‌.. పార్టీ పెడితే.. టీఆర్ ఎస్ ఏయే స్థానాల్లో పోటీ చేసే అవ‌కాశం ఉంది? ఏవిధంగా ముందుకు సాగుతుంది? అనే చ‌ర్చ వ‌స్తోంది. ప్ర‌స్తుతం కొంద‌రు మేధావులు చెబుతున్న దాని ప్ర‌కారం.. ఏపీ-తెలంగాణ బోర్డ‌ర్ జిల్లాల్లో.. టీఆర్ ఎస్ శ్రేణులు ఉన్నాయి. అదేస‌మ‌యంలో ఆయా జిల్లాల ప్ర‌జ‌లు కూడా తెలంగాణ‌లో ప‌నుల నిమిత్తం వెళ్తున్నారు.

అంటే.. ఉండేది ఏపీలోనే అయినా.. ప‌నులు.. ఉపాధి వంటివి తెలంగాణ‌లోనే చేసుకుంటున్నారు. సో.. ఇలాంటి జిల్లాల‌పై టీఆర్ ఎస్ దృస్టి పెట్టే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. బోర్డ‌ర్ జిల్లాలైన గుంటూరు, కృష్ణా, తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి, క‌ర్నూలు, ప్ర‌కాశం జిల్లాల‌తో పాటు సీఎం కేసీఆర్ పూర్వీకులు.. ఉన్నార ని చెబుతున్న శ్రీకాకుళం జిల్లాలోనూ పార్టీని పెట్టే అవ‌కాశం ఉంది. ఆయా జిల్లాల్లో త‌మ స‌రిహ‌ద్దుల‌కు అత్యంత స‌మీపంలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ ఎస్ పోటీ చేస్తుంద‌ని అంటున్నారు. ఇక్క‌డ ప్ర‌స్తుతం టీడీపీ హ‌వా కొన‌సాగుతున్న నియోజ‌క‌వ‌ర్గాలు.. అదేస‌మ‌యంలో వైసీపీ హ‌వా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.

అయితే.. రేపు టీఆర్ ఎస్ వ‌స్తే.. అటు వైపు మొగ్గు చూపే అవ‌కాశం ఉంది. ఎందుకంటే.. కేసీఆర్ త‌న ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను వీరికి కూడా అమ‌లు చేస్తాన‌ని ప్ర‌క‌టిస్తే.. ఖ‌చ్చితంగా ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. సో.. కేసీఆర్ వ్యూహం ఈ స‌రిహ‌ద్దు జిల్లాల‌పై నే ఉంద‌ని.. వీటిని దృష్టిలో పెట్టుకునే ఆయ‌న ఇలా వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌ని అంటున్నారు. క‌నీసం ఐదుగురు నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు క‌నుక ఇలా స‌రిహ‌ద్దు జిల్లాల్లో క‌నుక గెలిస్తే..(కొత్తొక వింత క‌నుక ప్ర‌జ‌లు ఓట్లేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు) అసెంబ్లీలో తెలంగాణ కు ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు వ్యూహం ప‌న్న‌వ‌చ్చ‌న్న‌ది.. టీఆర్ ఎస్ ఆలోచ‌న‌గా ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌ర‌గుతుందో చూడాలి.
Tags:    

Similar News