అప్పటివరకు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే కారుకు అనూహ్యంగా ఎద్దు ఎదురొస్తే ఎలా ఉంటుంది? ఏపీలో కాంగ్రెస్ పార్టీ సదరు కారు మాదిరే ఉంది. విభజన విషయంలో కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం..ఆ పార్టీని ఆ రాష్ట్రంలో సర్వనాశనం చేయటమే కాదు.. మళ్లీ కోలుకోవటానికి కనీసం రెండు దశాబ్దాలైనా పడుతుందని.. అప్పటికి కూడా విభజన తాలుకూ గాయం ఆ పార్టీని వెంటాడుతుందని భోరుమన్న ఏపీ కాంగ్రెస్ నేతలు అంచనాలు ఏ మాత్రం తప్పలేదు. విభజన జరిగిన ఏడేళ్లు అవుతున్నా.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అంటే చాలు.. ఛీదరించుకోవటం తెలిసిందే.
మరోవైపు జగన్ ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని కాంగ్రెస్ ను ప్రజలు మర్చిపోయిన పరిస్థితి. ఇలాంటివేళ.. పార్టీని కోలుకునేలా చేయటం కోసం కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పుడు ఫోకస్ చేసింది. గత వైభవం కోసం కాకున్నా.. ఉనికి కోసమైనా సరే.. పార్టీని యాక్టివేట్ చేయాలన్న యోచనలో రాహుల్ గాంధీ ఉన్నట్లు చెబుతున్నారు. చాలా కాలం తర్వాత పార్టీకి సంబంధించి ఏపీ వ్యవహారాలు చూసే ఉమెన్ చాందీతో రాహుల్ భేటీ అయ్యారు. ఏపీలో పార్టీ పరిస్థితి ఎలా ఉందన్న విషయంతో పాటు.. పార్టీని చక్కదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ మీదన వారి సమావేశం సాగినట్లు చెబుతున్నారు.
వారి చర్చలో ఎక్కువ భాగం మెగాస్టార్ చిరంజీవి చుట్టూ తిరిగినట్లుగా చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. రాజ్యసభ సీటుతో పాటు కేంద్రమంత్రి పదవిని సొంతం చేసుకున్న చిరును యాక్టివేట్ చేయాలన్న అభ్యర్థన రాహుల్ నోటి నుంచి వచ్చినట్లు చెబుతున్నారు. ఎప్పుడైతే తన రాజ్యసభ సభ్యత్వం ముగిసిందో.. అప్పటి నుంచి చిరంజీవి రాజకీయాల్ని అస్సలు పట్టించుకోవటం లేదని.. ఆయన ఫోకస్ మొత్తం సినిమాలు.. సేవా కార్యక్రమాల మీదనే ఉన్నట్లు చెబుతున్నారు.
ఏపీలో పార్టీని.. క్యాడర్ ను ఉత్సాహపర్చటానికి మంచి మాస్ లీడర్ తో పాటు.. జానాకర్షణ నేత అవసరం ఉందన్న మాట రాహుల్ చెప్పినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి మినహా మరెవరూ కనిపించటంలేదని.. అందుకే మరోసారి చిరు వద్దకు వెళ్లి మాట్లాడాలని ఉమెన్ చాందీకి చెప్పినట్లుగా తెలుస్తోంది. చిరుకోరుకుంటే రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవితో పాటు పార్టీలో కీలక పదవిని ఇద్దామన్న మాట రాహుల్ నోటి నుంచి రాగా.. పదవుల మీద చిరంజీవి ఆసక్తి చూపించటం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు చిరంజీవికి రాజ్యసభ పదవిని కట్టబెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీలు కూడా ఆలోచిస్తున్నాయని.. ఒకవేళ ఈ ప్రతిపాదన వారి నుంచి వస్తే చిరు స్పందన ఏమిటో తెలీదన్న మాట కూడా రాహుల్ చెవిన వేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా రాహుల్ తో ఉమెన్ చాందీ చర్చ మొత్తం చిరంజీవి చుట్టూనే తిరిగిందని.. తన సందేశాన్ని ఒకసారి చిరంజీవి వద్దకు వెళ్లి చెప్పాలని కోరినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఉమెన్ చాందీ హైదరాబాద్ కు వచ్చి.. చిరంజీవిని కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు.