మహమ్మారి విరుచుకుపడిన వేళ.. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన పిల్లల పరీక్షలు జరగకపోవటం తెలిసిందే. విద్యార్థుల భవిష్యత్తును పరిగణలోకి తీసుకొని టెన్త్.. ఇంటర్ పరీక్షల్ని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన వ్యాజ్యంలో తాజాగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తన అఫిడవిట్ ను దాఖలు చేసింది. అందులో పరీక్షల నిర్వహణపై తమ ఆలోచనల్ని వెల్లడించింది.
కొవిడ్ పరిస్థితుల్నిఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లుగా చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కొవిడ్ నివారణ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షల నిర్వహణ సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. పరీక్షలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై విచారణ ఈ రోజు (గురువారం) జరగనుంది. ఇదిలా ఉంటే పరీక్షల నిర్వహణకు తాము సిద్ధం చేసిన ప్రణాళికను పేర్కొంది. అందులో పేర్కొన్న ముఖ్యంశాల్ని చూస్తే..
- వేర్వేరు రోజుల్లో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల నిర్వహణ
- పరీక్ష గదిలో 15 నుంచి 18 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు
- ప్రతి విద్యార్థికి 5 అడుగుల దూరం ఉండేలా చర్యలు
- భౌతిక దూరం.. శానిటేషన్ తదితర అంశాలను కచ్చితంగా అమలు చేయటం
- విద్యార్థుల ఎంట్రీ.. ఎగ్జిట్ వేర్వేరుగా ఉండేలా చర్యలు