రెడ్.. ఆరెంజ్.. గ్రీన్ జోన్లలో మినహాయింపులేమిటి?

Update: 2020-05-02 05:15 GMT
అంచనాలు నిజమయ్యాయి. ముచ్చటగా మూడోసారి లాక్ డౌన్ ను మే 17 వరకూ పొడిగిస్తూ కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్ని మూడు జోన్ల పరిధిలోకి తీసుకొచ్చిన వైనం తెలిసిందే. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలుగా రెడ్ జోన్.. ఒక మోస్తరు ప్రమాద ప్రాంతంగా ఆరెంజ్ జోన్.. ఫుల్ సేఫ్ ప్రాంతంగా గ్రీన్ జోన్లను ఎంపిక చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని జిల్లాల్ని ఈ మూడింటి పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ మూడు జోన్లలోనూ కొన్ని మినహాయింపులు ఇచ్చారు. రెడ్ జోన్ లోనూ ఇలాంటి మినహాయింపులు ఉండటం గమనార్హం.

కేంద్రం విడుదల చేసిన తాజా ఉత్తర్వుల్లో.. ఆయా జోన్లలో వేటికి రిలాక్సేషన్ ప్రకటించారన్న విషయాల్లోకి వెళితే..


--మిగిలిన జోన్లతో పాటు రెడ్ జోన్లలోనూ కార్లలో ముగ్గురు ప్రయాణించే వీలు

--అన్ని జోన్లలోనూ టూ వీలర్ మీద ఒక్కరికే ప్రయాణించే వీలు

--పారిశ్రామిక వాడల్లో పనులకు అనుమతి

--నిత్యవసర వస్తువులు.. ఔషధాల ఉత్పత్తి కేంద్రాలకు అనుమతి

--పట్టణ ప్రాంతాల్లో నిత్యవసరాలు కాని షాపులకు అనుమతి

--పని ప్రదేశాల్లో కార్మికులు ఉండే భవన నిర్మాణాలకు అనుమతి

--ప్రైవేటు కార్యాలయాలు తమ సిబ్బందిలో 33 శాతంతో పని చేసుకునేలా వెసులుబాటు

--ప్రభుత్వ కార్యాలయాలు తెరిచేందుకు ఓకే

--రెడ్ జోన్ లో ఉపాధి హామీ పనులు.. పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు పచ్చజెండా

--ఆయుష్ కేంద్రాల్ని తెరిచేందుకు అనుమతి

--ఆరెంజ్ జోన్లలో ఇద్దరు ప్రయాణించేందుకు క్యాబ్స్ కు అనుమతి

--గ్రీన్ జోన్ లో 50 శాతం ప్రయాణికులతో బస్సులకు అనుమతి

--గ్రీన్ జోన్లలో అన్ని రకాల షాపులు తెరిచేందుకు ఓకే

--గ్రీన్ జోన్లలో వైన్ షాపులతో పాటు.. అన్ని రకాల సరుకుల రవాణాకు అనుమతి

--గ్రీన్ జోన్ లో వివాహాలకు 50 మందితో అనుమతి.. మరణాలకు 20 మంది అనుమతి. రెండింటిలోనూ భౌతిక దూరాన్ని తప్పనిసరగా పాటించాల్సి ఉంటుంది.

--ఈ అంశాల్ని మినహాయిస్తే.. లాక్ డౌన్ వేళ అమలు చేసే మిగిలిన అన్ని అంశాలకు గతంలో మాదిరే నిషేధాన్ని అమలు చేస్తారు.



రెడ్ జోన్ లో  ఆంక్షలు

- సైకిల్‌ రిక్షాలు, ఆటో రిక్షాలు నడపొద్దు

- టాక్సీలు, క్యాబ్‌లు తిరగొద్దు

- జిల్లా లోపల.. బయట కానీ బస్సులు తిరగకూడదు

- సెలూన్లు, స్పాలు మూసేయాలి.




రెడ్ జోన్ లో మినహాయింపులు

- కేవలం ఇద్దరు వ్యక్తులతో తిరగొచ్చు, బైక్‌ పై ఒక్కరే ప్రయాణించాలి

- పరిశ్రమల్లో అత్యవసర సరుకులను ఉత్పత్తి చేసేవి.. మెడికల్‌ ఉత్పత్తులు, ఐటీ హార్డ్‌ వేర్‌ రంగం, సరైన భౌతిక దూరం పాటిస్తూ జూట్‌ మిల్లుల నిర్వహణ వంటి వాటికి అనుమతి.
- పల్లె ప్రాంతాల్లో ఉండే అన్ని పరిశ్రమలకు సడలింపులు.

 - బయటి నుంచి కూలీలను తీసుకురాకుండా ఉన్న వారితో.. పట్టణాల్లో భవన నిర్మాణ పనులు, రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఓకే.

-  మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని అన్ని మాల్స్‌ మూసివేత. అయితే.. అత్యవసర సరుకులను అమ్మే వెసులుబాటు.

- ఒకే ఒక వ్యక్తి నడిపే షాపులు, కాలనీల్లోని షాపులు ఏ నిబంధనలు లేకుండా తెరుచుకోవచ్చు. వీటి వద్ద భౌతిక దూరం పాటించాలి.

- అత్యవసర వస్తువులకు మాత్రమే ఈ కామర్స్‌ సంస్థలకు అనుమతి.

-  33శాతం సిబ్బందితో ప్రైవేటు ఆఫీసుల నిర్వహించుకోవచ్చు.

- డిప్యూటీ సెక్రటరీ లెవల్‌ ప్రభుత్వ ఆఫీసులు 100 శాతం సిబ్బందితో పని చేసుకోవచ్చు.

- మిగిలిన ప్రభుత్వ ఆఫీసులన్నీ 33 శాతం సిబ్బందితో పనిచేయవచ్చు.




జోన్లు ఏదైనా అమలయ్యే ఆంక్షలివే..

--దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు రద్దు. వైద్య, రక్షణ రంగాలకు మినహాయింపు.

--కేంద్రం అనుమతించిన వారు తప్ప మిగిలిన వారికి రైళ్లలో ప్రయాణం నిషేధం.

--కేంద్రం అనుమతించిన బస్సులు మినహా అన్ని అంతర్రాష్ట్ర బస్సులకు అనుమతి లేదు

--మెట్రో రైల్‌ సర్వీసులు

--అంతర్రాష్ట్రాల మధ్య ప్రయాణాలు (వ్యక్తిగతంగా చేసే వాటిపై)నిషేధం.

--మెడికల్‌ లేదా కేంద్రం అనుమతించిన వారికి మాత్రమే అవకాశం

--అన్ని పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్‌ సంబంధిత సంస్థలన్నీ మూసివేత

--అన్ని సినిమా హాళ్లు, షాపింగ్‌ మాళ్లు, జిమ్, బార్లు, సమావేశ మందిరాల మూసివేత

--సామాజిక, రాజకీయ, క్రీడా సంబంధ కార్యక్రమాలు నిషేధం

--అన్ని రకాల మత కార్యక్రమాల రద్దు.
Tags:    

Similar News