ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు.. అమలు చేస్తున్న పథకాలు.. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు.. ఆరోపణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ పరిణామాలపై బీజేపీ నేతలు అప్పుడప్పుడు తమ గళాన్ని వినిపిస్తూనే ఉంటారు. కానీ.. అధినాయకత్వం మాత్రం అందుకు భిన్నంగా జగన్ పాలన మీద ఒక్కటంటే ఒక్క మాట అనేందుకు సిద్ధంగా లేకపోవటం తరచూ విస్మయానికి గురి చేసేలా ఉండటం తెలిసిందే. ఇదంతా చూసిన వారికి వచ్చే ప్రాథమిక సందేహం.. మోడీషాలతో జగన్ కు ఉన్న ఫెవికాల్ బంధం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారుతుంది.
జగన్ ను మోడీషాలు వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. అంత ఆగత్యం లేదు. అయినప్పటికీ.. యువనేతను కంట్రోల్ చేసే విషయంలో ఏమీ పట్టనట్లుగా వ్యవహరించటం కనిపిస్తుంది. ఒకవైపు తమ మిత్రపక్షమైన జనసేన అధినేతకు ఎదురుదెబ్బలు తగులుతున్నా.. చేదు అనుభవాలు ఎదురవుతున్నా? చూసి చూడనట్లుగా ఉండటం దేనికి నిదర్శనం అన్నది చర్చగా మారుతోంది.
నిజంగానే టీడీపీ అధినేత చంద్రబాబు పొడ గిట్టదనే అనుకుందాం. ఆ మాత్రం దానికే తమ ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసుకునేలా మోడీషాలు ప్రయత్నిస్తారా? అన్నది సందేహం పలువురి నోట వినిపిస్తోంది. చంద్రబాబు నచ్చకపోవటం ఒక కారణమే అనుకుందాం. మరి.. రాజకీయంగా చూసినా.. పాలనా పరంగా చూసినా జగన్ సర్కారు మీద బోలెడన్ని ఆరోపణలు వస్తున్న వేళ.. వాటిపై ఎలాంటి స్పందన లేకపోవటం పార్టీని దారుణంగా దెబ్బ తీస్తుందన్న మాట వినిపిస్తోంది. జగన్ తో మోడీషాలకు కలిగే ప్రయోజనం ఏమిటి? అన్న సందేహానికి రాజకీయ వర్గాల నుంచి వినిపించే సమాధానం ఒకటి ఉంటుంది.
ఎక్కడైనా ఏదైనా.. రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీకి అవసరమైన సాయాలకు జగన్ సిద్ధంగా ఉంటారని.. అదే వారి ఫెవికాల్ బంధానికి కారణమని వాదన వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ఈ ప్రచారానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక ప్రశ్నలు ఎదురవుతుంటాయి. దేశంలోనే అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి.. తమ పార్టీకి ఏ మాత్రం సంబంధం లేని ఒక పార్టీ అధినేత.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చే సాయాన్ని అందుకునేంత దీన స్థితిలో మోడీషాలు ఉన్నారా? అన్న వాదన వినిపిస్తూ ఉంటుంది. తాము కోరుకోవాలే కానీ.. చిటికె వేయటం తర్వాత.. కనురెప్ప పైకి ఎగరేసేంతలోనే విషయాన్ని అర్థం చేసుకొని సెట్ చేసేటోళ్లు బోలెడంత మంది ఉంటారన్న మాట వినిపిస్తుంటుంది.
మోడీషా.. జగన్ మధ్య ఫెవికాల్ బంధం వెనకున్న విషయం ఏమిటన్న దానిపై మరోసారి చర్చ మొదలైంది. అది కూడా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సుదీర్ఘ భేటీ నేపథ్యంలో.. జనసేన అధినేతను మోడీషాలు మళ్లీ కంట్రోల్ చేస్తారన్న మాట వినిపించే క్రమంలో.. ఫెవికాల్ బంధంపై చర్చ ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారిందని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.