కుప్పం ప‌రిస్థితి ఏంటి? టీడీపీలో హాట్ టాపిక్‌

Update: 2021-11-07 15:34 GMT
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పం. ఇక్క‌డ నుం చి వ‌రుస‌గా ఆయ‌న మూడున్న‌ర ద‌శాబ్దాలుగా గెలుపు గుర్రం ఎక్కుతున్నారు. ఆయ‌న‌ను టార్గెట్ చేయా లని.. ఓడించాల‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాజ‌కీయ పార్టీ కూడా అనుకోలేదు. కానీ.. ఇప్పుడు వైసీపీ నాయ‌కు లు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ను ఓడించి.. రికార్డు సృష్టించాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మం లోనే తాజాగా వ‌చ్చిన కుప్పం మునిసిపాలిటీ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఇక్క‌డ పాగా వేయ డం ద్వారా.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బాబును ఓడించాల‌నేది వైసీపీ వ్యూహంగా ఉంది.

ఇప్ప‌టికే కుప్పం మునిసిపాలిటీ.. నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగిసిపోయింది. అంతేకాదు.. చాలా వ‌ర‌కు వార్డు ల ను వైసీపీ ఏక‌గ్రీవం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అదేస‌మ‌యంలో ఇక్క‌డ టీడీపీ ఓటు బ్యాంకు ను కూడా త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని విధాలా చ‌ర్య‌లు చేప‌ట్టింది. మ‌రీ ముఖ్యంగా మం త్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి ఇక్క‌డి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీంతో కుప్పం రాజ‌కీయం వేడె క్కింది. ఇక‌, టీడీపీ త‌ర‌ఫున నామినేష‌న్ వేయాల‌ని ప్ర‌యత్నించిన వారిని ఇప్ప‌టికే అడ్డుకున్నారు. కొంద రి నామినేష‌న్ల‌ను చింపేశారు. ఇంకొంద‌రికి తిర‌స్క‌రించేలా చేశార‌ని .. టీడీపీ స్థానిక నాయ‌కులే.. చెబుతు న్నారు.

మ‌రి ఇంత జ‌రుగుతున్నా.. పార్టీ అధిష్టానం మాత్రం మౌనంగా ఉండ‌డం ఇక్క‌డివారిని మ‌రింత నిరాశ‌కు గురిచేస్తోంది. ఇంకా, నోటిఫికేష‌న్ రాక‌ముందుగానే చంద్ర‌బాబు ఇక్క‌డ ప‌ర్య‌టించారు. కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సా హం నింపే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, నోటిఫికేష‌న్ వ‌చ్చిన త‌ర్వాత‌.. నామినేష‌న్ల ఘ‌ట్టం స‌మ‌యంలో మా త్రం ఏ ఒక్క కీల‌క నేత కూడా ఇక్క‌డ లేక‌పోవ‌డం.. పార్టీ శ్రేణు్ల్లో ధైర్యం నింపే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ డం గ‌మ‌నార్హం. దీంతో పార్టీ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో నిరాశ‌కు గుర‌య్యారు. అంతేకాదు.. వైసీపీ నేత‌ల నుంచి వ‌స్తున్న ఒత్తిళ్ల‌ను.. కూడా వారు స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొన‌లేక పోతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రి ఈ ప‌రిణామాలు తెలిసి కూడా చంద్ర‌బాబు మౌనంగా ఉన్నారా? లేక‌.. కుప్పంను కూడా వ‌దిలేసుకు న్నారా? అనే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News