ఓటర్లు నిద్రపోతున్న వేళ : రూ. 100 కోట్లు దాటిన ఖర్చు ... 50 శాతం కూడా కానీ పోలింగ్ !
జీహెచ్ ఎంసీ ఎన్నికల నగారా మోగిన సమయం నుండి ఎక్కడ చూసిన అదే కోలాహాలం. అన్ని ప్రధాన పార్టీలు కూడా మేయర్ పీఠం పై కన్నేయడం తో గ్రేటర్ పోరు రణరంగాన్ని తలపించింది. విమర్శలు , ఆరోపణలు , ప్రలోభాలు , డబ్బు పంపిణీ అంటూ నానా హంగామా చేసారు నేతలు. డబ్బులు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. కానీ, తీరా పోలింగ్ డే రోజు పరిస్థితి చూస్తే ..మరీ దారుణంగా తయారయింది. కనీసం 50 శాతం కూడా పోలింగ్ జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు బోసి పోయి కనిపిస్తున్నాయి. చాలా చోట్ల బూత్ ఏజెంట్లు, పోలీసులు తప్ప ఓటర్లు కనిపించడం లేదు. బస్తీలు, నగర శివార్లలో పోలింగ్ కాస్త మెరగ్గా ఉంది. ఇక జాబులు చేసే వారు, టెకీలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ ఒక్కశాతం కూడా దాటకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో జాబ్ హోల్డర్స్, టెకీల తీరును నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. ‘ఓటు మన బాధ్యత అంటూ వాట్సాప్ స్టేటస్‌లు పెట్టడం కాదు.. వచ్చి ఓటు వేయడం ముఖ్యం’.. ‘ఆ పార్టీ అలా.. ఈ పార్టీ ఇలా అన్ని తిట్టడానికి ముందుంటారు మరి ఓటేయడానికి ఏమైంది’.. అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. గ్రేటర్ లో తక్కువ పోలింగ్ నమోదు కావడానికి ప్రధాన కారణం వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడం అని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పోలింగ్ రోజు సెలవు ఇచ్చి, ఓటు వేయమని చెప్పినా చాలా మందికి బద్ధకం. ఇళ్ల దగ్గరే ఉంటారు కానీ ఓటు వేయరు. అలాంటిది శని, ఆదివారాలు వీకాఫ్, సోమవారం గురునానక్ జయంతి, మంగళవారం పోలింగ్ కావడంతో ప్రభుత్వ సెలవు అన్ని కలుపుకుని వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. దాంతో టెకీలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు ఊరి బాట పట్టారు. పోలింగ్ ఇంత తక్కువ నమోదవ్వడానికి ఇది ప్రధాన కారణం. ఇక కరోనా భయంతో మరికొందరు ఓటు వేయడానికి ఇష్టపడలేదు. ఐటీ, డిజిటల్ రంగాల్లోని కంపెనీలన్నీ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ ఎనీవేర్' సౌకర్యం కల్పించడంతో లక్షలాది మంది టెకీలు ఇప్పటికే ఊళ్లకు వెళ్లిపోయారు. ఇది కూడా గ్రేటర్ లో పోలింగ్ శాతం తగ్గడానికి మరో కారణం..
జీహెచ్ ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకుగానూ మొత్తం 74లక్షల, 67వేల, 256మంది ఓటర్లున్నారు. కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి భారీ స్థాయిలో 9, 101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సామాగ్రి, సిబ్బంది జీతభత్యాలు.. అన్నీ కలుపుకొని ఒక్కో బూత్ కు సరాసరి రూ.60వేలు కేటాయించారు. అంటే, కేవలం పోలింగ్ కోసమే దాదాపు 60 కోట్ల ప్రజాధనం ఖర్చవుతోంది. కౌంటింగ్ ప్రక్రియ కోసం మరో 15 కోట్లు వెచ్చిస్తున్నారు. వెబ్ కాస్టింగ్, పరిశీలకులు, భద్రతా సిబ్బంది తదితర లెక్కలన్నీ కలిపితే గ్రేటర్ ఎన్నికలకు రూ.100 కోట్ల ప్రజాధనం ఖర్చవుతోంది. ఇంతచేసినా.. పోలింగ్ మాత్రం 50 శాతం కూడా దాటడంలేదు.
సాధరణంగా గ్రామాల్లో పోలింగ్ రోజు పండుగ వాతావరణం కనిపిస్తుంది. పనుల కోసం ఎక్కడికి వెళ్లినా కూడా ఓటింగ్ డే నాడు సొంత ఊరికి వచ్చి ఓట్లు వేస్తుంటారు. స్థానిక నాయకులు కూడా ప్రత్యేక శ్రద్దతో ఓటర్లను తరలిస్తారు. ఇక గ్రామీణ ప్రాంత ప్రజలు ఎన్ని పనులున్నా ఓటు వేయడం మాత్రం మర్చిపోరు. ఇక నగరవాసుల తీరు పట్ల నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటు వేయనివారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా కోల్పోతారని చెప్తున్నారు. ఈ రోజు ఉదయం నుండి కూడా ప్రముఖులు , రాజకీయ నిపుణులు , సినీ స్టార్ తమ ఓటు హక్కు వినియోగించుకొని , భారీగా ఓటింగ్ జరగాలని, అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్తున్నా కూడా పోలింగ్ శాతం లో స్పీడ్ పెరగలేదు. ఇకపోతే , మధ్యాహ్నం 4 గంటల వరకు మొత్తంగా 29.76 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.