హోం ఐసోలేషన్ తర్వాత ఏం చేయాలి? పరీక్ష అవసరమా?

Update: 2021-05-02 02:30 GMT
కొవిడ్ మహమ్మారి విలయ తాండవం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా రోజువారీ కేసులు మూడు లక్షలకు పైగా నమోదవుతున్నాయి. కరోనాతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మృత్యవాత పడుతున్నారు. రెండో దశలో భాగంగా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ఫలితంగా ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగా లేవని అంటున్నారు. ఇక మందులు, ఆక్సిజన్ కొరత వార్తలు సామాన్యుల్లో కాస్త భయాన్ని కలిగిస్తున్నాయి.

వైరస్ సోకిన ప్రతిఒక్కరూ ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఉండి, ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సమక్షంలో చికిత్స పొందాలని సూచించారు. స్వల్ప లక్షణాలు ఉండి, ఇతర సమస్యలు లేకపోతే హోం ఐసోలేషన్ లో కోలుకోవచ్చని అంటున్నారు. ఈ పద్ధతిలో లక్షల మంది వైరస్ నుంచి విముక్తి పొందారు. అయితై హోం ఐసోలేషన్ తర్వాత ఏం చేయాలనేది ప్రస్తుతం ఉన్న సందేహం.

హోం ఐసోలేషన్ తర్వాత కొవిడ్ పరీక్ష చేయించుకోవాల అనే దానిపై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వివరణ ఇచ్చారు. కొవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నవారిలో ఏడు రోజుల్లో వైరస్ చచ్చిపోతుందని తెలిపారు. అప్పటినుంచి ఇతరులకు వ్యాపించదు అని అన్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు రెండు, మూడు వారాల తర్వాత వైరస్ ఉనికిని గుర్తించగలగుతాయని చెప్పారు. వైరస్ సోకి పది రోజులు పూర్తయ్యాక, జ్వరం లేకపోతే మళ్లీ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదని వివరించారు.

కరోనా సోకగానే భయబ్రాంతులకు గురి కాకుండా మనో బలంతో ఎదుర్కొవాలని సూచించారు. ఇతర ఆరోగ్య సమస్యలు లేనివారు ఇంట్లోనే వైరస్ జయించవచ్చని చెప్పారు. భారత్లో సెకండ్ వేవ్ చూసి ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. దేశంలో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయని నిపుణులు అంటున్నారు. మరికొన్నాళ్ల పాటు జాగ్రత్తలు అవసరమేనని చెబుతున్నారు.
Tags:    

Similar News