అమెరికాలో హిందూ పూజారిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. కాషాయ దుస్తులు ధరించి గుడికి వెళుతున్న పూజారి హరీశ్ చందర్ పై జరిగిన దాడి కారణంగా తగిలిన గాయాల నుంచి ఆయన ఇప్పడిప్పుడే కోలుకుంటున్నారు. దాడి కారణంగా ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు స్పస్టం చేస్తున్నారు.
గుడికి వెళుతున్న హరించందర్ వెనుక వైపు నుంచి దాడి చేసిన దుండగుడ్ని పోలీసులు గుర్తించారు. 52 ఏళ్ల సెర్జియా గువెయగా గుర్తించారు. దాడి సమయంలో నిందితుడు ఇది మా ప్రాంతం.. వెళ్లిపోవాలంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇది విద్వేషపూర్వక దాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. హరీశ్ చందర్ శిష్యులు మాత్రం తమ గురువు మీద జరిగిన దాడి విద్వేషపూర్వక దాడిగానే అనుమానిస్తున్నారు. ఈ దాడి ఉదంతంపై స్థానిక హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దాడికి కారణమైన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. విచారణ పూర్తి అయితే కానీ.. దాడి వెనుకున్న కారణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉండదంటున్నారు.