సీఐడీ నోటీసులపై చంద్రబాబు ఏం చేయనున్నారు?

Update: 2021-03-16 11:30 GMT
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో దారుణ పరాభావాలతో కునారిల్లుతున్న టీడీపీకి ఇప్పుడు చంద్రబాబుకు సీఐడీ నోటీసులు పంపడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారిందని నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. కష్టాల్లో ఉన్న పార్టీని నిలబెట్టే అధినేతకే కేసులు చుట్టుముట్టడంపై ఏం చేయాలనే దానిపై టీడీపీ బ్యాచ్ మథనపడుతోందట..

చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై 40 ఇయర్స్ పాలిటిక్స్ అనుభవం ఉన్న చంద్రబాబు ఏం చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.విచారణకు చంద్రబాబు హాజరు అవుతారా? లేదా హాజరు కాకపోతే ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది? అనేది చర్చనీయాంశమైంది.ప్రస్తుతం చంద్రబాబు దీనిపై హైకోర్టుకు ఎక్కి స్టే కోసమే ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

అయితే హైకోర్టుల్లో ప్రధానంగా అమరావతి భూకుంభకోణం ఆరోపణలు నిలుస్తాయా? అనే విషయంపై చంద్రబాబు న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారని ప్రచారం సాగుతోంది.ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా ఇప్పుడు చంద్రబాబు మెడకు అమరావతి భూకుంభకోణం తగిలిందన్న ఆవేదన ఆగ్రహం ఆయన సన్నిహితుల్లో మొదలైందని ప్రచారం సాగుతోంది.
Tags:    

Similar News