ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం పడుకొనే వరకు ప్రతి ఒక్కరికి అదే పని. తినే తిండి నుండి పడుకునే బెడ్ వరకు అన్ని విషయాలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే , ప్రముఖ సోషల్ మీడియా సైట్లు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఏదైనా సందేశం పంపాలన్నా, స్వీకరించాలన్నా సాధ్యం కాక నెటిజన్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో న్యూస్ ఫీడ్ ను అప్ డేట్ చేయలేకపోయారు. కొందరైతే తమ అకౌంట్లలో లాగిన్ కూడా కాలేకపోయారు.
ఎర్రర్ అనే సందేశం కనిపించడం చూసి తల పట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. సర్వర్ డౌన్ వల్లే ఆయా సైట్లు మొరాయించినట్లు సమాచారం. భారత్ సహా పలు దేశాల్లో సుమారు 45 నిమిషాలపాటు నిలిచిపోయిన సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. శుక్రవారం రాత్రి 10.55 గంటల సమయంలో ఈ సమస్య తలెత్తింది. అయితే 11:24 గంటల సమయంలో ఈ సోషల్ మీడియా యాప్స్ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. గతేడాది డిసెంబర్ లోనూ ఈ ఫేస్ బుక్ కు చెందిన సర్వీసులు కొద్ది గంటల పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఫేస్‌బుక్ మాతృ సంస్థకు చెందిన కంపెనీలనే విషయం తెలిసిందే. ఈ మూడు సర్వీసులు ఒకేసారి నిలిచిపోవడం గమనార్హం. ఇంతకీ ఈ మూడు సోషల్ మీడియా సేవలు ఒకేసారి ఎందుకు నిలిచిపోయాయన్నదానిపై ఇంకా ఆ సంస్థలు క్లారిటీ ఇవ్వలేదు. ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘డౌన్ డిటెక్టర్’ గణాంకాల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మంది మంది, వాట్సాప్‌పై 38 వేల మంది, ఫేస్‌బుక్‌పై 1,600 మంది ఫిర్యాదు చేశారు.